వినుము రాజ నా సంకల్పమును తెలిపెద
ఒక లక్ష సిద్దికై యజ్ఞదీక్షను చేపట్టినాను
పరాక్రవంతులైన ఇద్దరు రాక్షసులు
రక్త మాంసములతో యజ్ఞ భంగము చేస్తున్నారు
మారీచుడు సుభావుడు అనే ఇరువురు రాక్షసులు
వారిని వధించుటకై రాముని నాతో పంపు రాజా
శ్రీరాముడే వారిని వధించగల దీరుడు
రాముని దాటికి వారు నిలువ లేరు
నీ ప్రియ పుత్రుడైన శ్రీరాముడిని
పది దినములు నా చెంతనే నుంచు దశరథ
విశ్వామిత్రుని పలుకులు విన్న దశరథుడు
శోకసముద్రంలో మునిగిపోయినాడు
రాముడు పసిపిల్లవాడు
పదహారేళ్ల ప్రాయము నిండినవాడు
రాక్షసుల దాటికి నిలువ లేడు బాలుడు
బాధతో మహర్షిని వేడుకుంటాడు
ముక్కు పచ్చలారని చిన్న బాలుడిని ఎలా పంపాలి
వారిని వధించుటకు నేనే వస్తాను స్వామి
వద్దు వద్దు నీవు వచ్చుట అసలే వద్దు
పంపనంటే చెప్పు నేను వెళ్ళిపోతాను దశరథ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి