సామెత -209: ఆడపిల్ల సిగ్గుబిళ్ళ అందట్లో అగపడొద్దు
****
"ఏం మడిషో ఏమో అవ్వా! ఎన్ని త్యేపల జెప్పాలె! 'మడిషికో మాట- గొడ్డుకో దెబ్బ'అని గందుకే అన్నరు. 'శెప్పితే ఇననన్న యినాలె-వొంటనన్న బుట్టాలె' గట్ల లేని మడిషితో ఏగడం శానా కట్టం.
"ఏంది శెల్లే? గంతగనం రంది జెయ్యవడ్తివి? ఎవలు నీ మాట యినంది జెర జెప్పు. ఎందుకు గా బాద బారం మన్సుకెత్తుకుని విలవిల్లాడ్తవు. మనం శెప్తే ఇనే దినాలేనా గివి. సూత్తుండాలె. ఊకూకెనే బుగులు పడ్తవెందుకు?"
"ఏం జెయ్యను అవ్వా?'సేశే శెయ్యి ఊకోదు. మాట్లాడే నోరూ ఊకోదు.' అంటెనేమో అన్ననంటరు. పెద్దదాన్ని ఎందుకు శెప్తుందో ఏమోనని జెర శెవి వారిచ్చి యినాల్నా వద్దా? నువ్వే శెప్పు?
"ఏంది శెల్లె? వొచ్చిన కానుంచి సూత్తున్న .అస్లిష్యం శెప్పకుండ దాత్తున్నవ్! గంత శెప్పకూడందా?
అయ్యో గట్ల గాదవ్వా! నీకు జెప్పడానికే వొచ్చిన. మా మన్వరాల్ని సూశినవు గద.ఏడాది పొల్ల .గా దానికి బరక బరక బట్టలేత్తుంటే ఊడబీక్కోని అసలు బట్టలే లేకుండా తిరుగుడు.ఏత్తె లబ్బలబ్బ ఏడ్సుడు జేత్తుంటే"గట్ల పొల్లని బరిబత్తల ఉంచొద్దు శెడ్డీ అన్న ఎయ్యాలె లేకుంటే దానికి జేయించిన సిగ్గు బిళ్ళ అన్న కట్టవే అన్న'. గిందుల నా మాటల్ల ఏమన్న తప్పుందా అవ్వ? నా బిడ్డ నా యిట్టం అన్నట్టు మొగమంత గంటు బెట్కొని తిరగబట్టింది.
"నువ్వన్న దాంట్లె తప్పేం లేదు శెల్లే! ఎన్కటోళ్ళు "ఆడపిల్ల - సిగ్గు బిళ్ళ అందట్లో అగపడొద్దు " అనేటోళ్ళు.గిందుల నువ్వన్నట్టు కొంత నిజమే శెల్లే!శిన్న పొల్ల పాపం దాని లేత పెయ్యికి బరకబట్టలు ఎంత శికాకు తెప్పిత్తయి. మాటలొత్తే యిష్యం జెప్పేది.గందుకే మనమన్న గస్మంటివి సూస్కోవాలె.
బరిబత్తల ఉంచకుండ శెడ్డీనో,లాగో వెయ్యాలె.ఎన్కటోళ్ళు ఎవలి సూపులు ఎస్మంటియో అని శిన్న పొల్లలకు ఎండితో జేయిచ్చిన సిగ్గుబిళ్ళ మొలకి కట్టేవారు.అందట్లో సుత తిరగనిచ్చేవారు కాదు. ఆడివిల్లలని శానా జాగర్తగా సూస్కోవాలె అని శెప్పేవాళ్ళు. రోజులు మారిపోయినయి.ఆడివిల్లలు అందట్ల తిర్గక తప్పట్లే.గందుకనే మంచి బట్టలు ఒంటిని కప్పేవి ఏస్కోవాలి.."
గదండీ సంగతి "ఆడపిల్ల - సిగ్గుబిళ్ళ అందట్లో అగపడొద్దు" అంటే గిదే మరి.గీ కాలంల నలుగుట్ల తిరగడం తప్పదు గని ఎప్పుడూ జాగర్తగా ఉండాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి