సుప్రభాత కవిత : - బృంద
వేదనతో ఓడిపోక 
చీకటికి లొంగిపోక 
ఓపికగా వేచిచూస్తే 
వేకువన్నది వచ్చితీరు!

మౌనమే నీ నేస్తమైతే 
గుండె సవ్వడి నీతో లేదా?
ఓటమన్నది ఒప్పుకోక 
నిలిచి పోరితే గెలుపు రాదా?

నీకు నువ్వు తోడైతే 
సైన్యమెందుకు?
నీతో నీవు పోటీ పడితే 
విజయం నీదే కదా!

మంచితనపు హద్దులు 
ఎంచి చూసి నడిస్తే 
వంచన పాలవకుండా 
పెంచలేవా నమ్మకాన్ని!

గడచిన ఘడియ కూడా 
గతమే గా తరచి చూడ 
నడచిన తోవ చెప్పదా 
మంచేదో  చెడు ఏదో!

నిన్న కన్నా మిన్నగా 
నిన్ను నీవు నిలబెడితే 
రేపు ఎపుడూ గొప్పగా 
కొత్త వెలుగులివ్వదా?

వెతలు తీర్చి 
కథలు మార్చే 
వెలుగు తెచ్చు 
వేకువకు 

🌸🌸సుప్రభాతం 🌸🌸

 

కామెంట్‌లు