అన్నం పరబ్రహ్మ స్వరూపం: - ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్(పుష్యమి)-విశాఖపట్నం
అన్నపూర్ణకు నిలయమైన భారతావనిలో
ఆకలితో అలమటించే అన్నార్తుల సంఖ్య
అధికమవుతు ఉన్న విషయం విని
అరవై ఏళ్ల అనుభవంతో
ఆర్ధ్రతతో వ్రాస్తున్నా
ఆర్భాటంగా వివాహ,పుట్టినరోజు వంటి   వేడుకలలో
అంతస్తుకు తగ్గట్టు ఉండాలంటు
అరవై రకాల పదార్ధాలను 
అరటాకుల నిండా వడ్డిస్తు
ఆరు ప్రాంతాలలో కొన్ని చోట్ల అదిరే కాంతులీను 
టెంటుల కింద యూనిఫార్మ్ డ్రెస్ లలో ఉన్న వారు
అందరికి బఫే అంటు  వడ్డిస్తు నిలబడి
ఆహారం సగం తిని ,ఎవరో చెప్పగా అది వదలి
అక్కడి కెళ్ళి వేరొక పదార్థం తిని
అది పూర్తిగా తినక  వదిలేస్తు
అరడజను డ్రింక్ లు
ఐస్క్రీములు పెట్టి, 
నోరు ఎర్రబడటానికి రెండు మూడు పాన్ లు
ఎన్నని, ఏమని చెప్పను 
అన్నం పర బ్రహ్మ స్వరూపమని తెలిసికూడా
ఆహారాన్ని దుర్వినియోగంచేయడం ఎంతవరకు సమంజసం?

విజ్ఞులమని చెబుతున్న మనమంతా ఒక్కసారి ఆలోచించ వలసిన విషయం
ఆకలితో అలమటించే అన్నార్తుల వ్యథను తీర్చడానికి ఆడంబరాలకు పోక ఆహారాన్ని వృథాచేయక
"అన్నం పరబ్రహ్మ స్వరూపం"అన్నదానికి ప్రతీకగా నిలుద్దాం..!!
............................

( నేడు జరిగే  అనేక కార్యక్రమాలలో  ఆహారం దుర్వినియోగం అవడం చూసి ఆర్ద్రత తో వ్రాసినది)

కామెంట్‌లు