ఆయుధం శరీరాన్ని గాయపరచగలదు… కానీ అక్షరం మనసును మలచగలదు. అదే అక్షర శక్తి!
నేటి డిజిటల్ యుగంలో స్క్రీన్‌ల వెలుగులో మన కళ్లే కాదు… మన ఆలోచనలు కూడా బంధించబడుతున్నాయి. స్క్రోల్ చేస్తూ గడిపే గంటలు, మన ఎదుగుదలను దూరం చేస్తున్నాయి. అలాంటి సమయంలో పుస్తకం మాత్రం నిశ్శబ్దంగా మనతో మాట్లాడే గురువు… మనలో దాగి ఉన్న సామర్థ్యాన్ని మేల్కొలిపే మిత్రుడు.
అంతర్జాతీయ పుస్తక దినోత్సవం సందర్భంగా యువతకు ఒక పిలుపు…
ఒక పుస్తకం చేతిలోకి తీసుకోండి… అది మీ జీవితాన్ని చేతిలోకి తీసుకునేలా మార్చుతుంది.
ఒక మంచి పేజీ చదవండి… అది మీలో కొత్త ఆలోచనను నాటుతుంది.
ఒక మంచి ఆలోచన పెంచుకోండి… అది మీ భవిష్యత్తును నిర్మిస్తుంది.
ఇప్పటి ట్రెండ్ ఫాలో కావడం కాదు… ట్రెండ్ సెట్ చేయాలి.
అది సాధ్యమయ్యేది పుస్తకాల ద్వారా మాత్రమే.
📚 నేటి ఒక పుస్తకం… రేపు మిమ్మల్ని ఒక కొత్త వ్యక్తిలా మార్చుతోంది.
Read Smart… Think Big… Become Different!
మీ
ఎస్.వి.రమణా చార్య

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి