అనురాగ ఆప్యాయతలను రంగరించి
జన్మనిచ్చిన తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచి
యుక్తాయుక్త విచక్షణను నేర్పి
తమకన్నా అన్నింటిలో ఉన్నతులుగా ఎదగాలని
పుత్రోత్సాహం తండ్రికి
పుత్రుడు పుట్టంగా గాదు పుట్టదు జనులా
పుత్రుని పొగడంగ నాడు కలుగు అన్న సుమతీ శతకకారుడు చెప్పినట్లు అన్నది మరచి
నేటి సమాజాన యువత మత్తుకు బానిసలై
నిర్వీర్యంగా తయారై
ఇరవై లో అరవై గా మారి
పరమాత్ముడిచ్చిన జీవితాన్ని
అర్దాంతరంగా ముగిస్తున్న సంఘటనలు
ముక్కు పచ్చలారని పసిపిల్లలను
పసిమొగ్గలుగానే తమ కామానికి బలిచేసి
కన్నవారి కడుపుకోతకు భాధ్యులై
ప్రతి చిన్నవిషయానికి పరీక్షతప్పేమని, ప్రేమవిఫలమైందని,
అనుకున్నది సాధించలేదని యువత ,పంటలు పండలేదని
రైతన్నలు,వ్యాపారంలో నష్టం వచ్చిందని ఆత్మహత్యలకు పాల్పడుతు
కన్నవారి,కట్టుకున్నవారి కడుపుకోతకు కారణమవుతున్న
ఓ మానవా తెలుసుకో
కడుపుకోత పగవాడికైనా వద్దని
సమస్యల పరిష్కారానికి ఆత్మహత్యలు సమంజసము కాదని
జన్మానామ్ నరజన్మ దుర్లభమన్నది గుర్తెరిగి
జీవితం పరమాత్ముడిచ్చిన వరం.
చక్కటి ప్రణాళికాబద్ధమైన జీవితంతో
నైతిక విలువలతో సంస్కారయుతంగా జీవిస్తే
జీవితమే బంగరుమయమగును..!!
.................................
ఆత్మ హత్యలకు కారణమెవరు?: - కవి మిత్ర, సాహిత్య రత్న -ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్ (పుష్యమి)-విశాఖ పట్నం
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి