ఆర్ధిక పరి పుష్టి , కుటుంబ ప్రోత్సాహం...
ఉన్నవారు అదృష్ట వంతులు...!
చక్కగా చదువుకుని,గొప్ప గొప్ప వుద్యోగస్టులు కాగలరు...!
నాలంటి శాప గ్రస్తులకు ... దురదృష్ట వంతులకు...
ఆలాంటి అవకాశా
లుండవ్...!
నేను బడి కెళ్ళి చదివిందేమీ లేదు...
కేవలం చడగలగటము రాయగలగటం తప్ప..!!
ఐదు పూర్తయి , ఆరులో అడుగు పెట్టటం తోనే...
నా పూర్వ కర్మ ఫలం మరింత వికృతంగా విజృంభించింది...
తినే తిండికి, కట్టే బట్టకే ఇబ్బందైతే ఇంక చదువు మీద దృష్టె క్కడ..!?
వీ టికి తోడు... టైఫాయిడ్
మలేరియాలు వదలకు పట్టి పీడిస్తే....
ఇంక స్కూల్ కి వెళ్లే దె ప్పుడు...?!
ప రీ క్ష లు రాయక పొయ్యినా. ...
ఏడో క్షాసు పరిస్థితీ ఇదే మార్పులేదు...!
అక్కటినుండి ఇక చదువు సాగలేదు...!
బడి వదలి బజారున పడింది బతుకు...!
తరువాత చాన్నాలకు... అంబేద్కర్ ఓపెన్ యూని వర్సిటి నుండి BA కట్టి పాసైనా... పొందిన ప్రత్యే క జ్ఞానమేమీ లేదు...!
బ్రతుకు తెరువు కోస0 పని చేసు కుంటూనే... పక్కనున్న పాన్ షాప్ నుండి డిటెక్టివ్ పుస్తకాలు అద్దెకు తీసుకుని చదివే నేను....
మంచి మిత్రుల పరిచయాలు , మహా పురుషుల ఉపన్యాసాలు
మంచి మంచి జానపద, పౌ రాణిక సినిమాలు...
నన్ను మరింతగా పుస్తకా లకు చేరువ చెయ్యటం...
రామాయణ , మహాభా రత, భాగవత, బైబిల్తో పాటు,అనేక ఆధ్యాత్మిక
హేతువాద, గ్రంధాలతో పాటు...
వేదాంత , గాంధీ ఆత్మ కధ, నెహ్రూ ఇందిరకు జై లు నుండి ఉత్తరాలు...
గోర్కి అమ్మ, HV శేషాద్రి కాల రాత్రి వంటి అనేక పుస్త కాలు చదివే భాగ్యం కాలగటం నే నే జన్మ లోనో చేసు కున్న పుణ్యమేమో !!
ఏ మీ తెలియని స్థాయి నుండి...
దేన్ని తెలుసుకుంటెఇంక
తెలుసుకో వలసిందేమీ వుండదో దాన్ని తెలుసు కో గలిగాను అంటే.... ఆ గొప్పతనమంతా పుస్త కాలదే...!
పుస్త కాలు జ్ఞాన నిధులు...!
ఎంత మనం దాని నుండి పొందినా...
ఆ నిధి అలానే వుంటుంది...!!
పుస్తకాలు మన మస్తిష్కా లను పదును పట్టే పదును రాళ్ళు...!
మనిషిని మనీషిగా... మహాత్మునిగా మలచగల జ్ఞాన సాన రాళ్ళు...!!
పుస్త కం కేవలం హస్థ భూ షణమే కాదు..., మన జీ వన యానం లో...కర
దీపిక....!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి