పేదింటి బిడ్డడు : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
పేదవారింట పుట్టావు 
బాధలు ఎన్నో పడ్డావు 
బడికి నీవు వెళ్లావు 
గది వేలపలనే నీవున్నావు 

అంటరాని వాడంటూ 
వెంట ఎవరు నడవలేదు
కూడి ఎవరు ఆడలేదు 
ఒక్కడినే అని నిలిచావు 

భరతమాత ముద్దుబిడ్డగా
బారిష్టర్ చదివావు 
బాగా నీవు ఎదిగావు 
భావితరాన్ని మార్చావు 

నీవు అంటరానితనాన్ని 
వెంట లేకుండా చేశావు 
అందరూ సమానమన్నావు 
రాజ్యాంగాన్ని రచించావు 

అంబేద్కర్నిగ నిలిచావు 
అందరూ ఒకటే అన్నావు 
అందరి మన్ననలు నొందావు 
ముందు ముందుకు నడిచావు 


కామెంట్‌లు