సహకార సంఘాల ఉద్యమ పితామహుడు: - - యామిజాల జగదీశ్
 మద్రాసు రాష్ట్రంలో సహకార సంఘాల ఉద్యమ పితామహుడైన టి.ఎ. రామలింగం చెట్టియార్. 
ఈయన 1881 మే 18న తిరుప్పూర్‌లో తిరుప్పూర్ అంగప్ప చెట్టియార్, మీనాక్షి అమ్మల్ దంపతులకు జన్మించారు. అంగప్ప చెట్టియార్ ఒక పత్తి వ్యాపారి. బ్యాంకర్.
చెట్టియార్‌ను పాఠశాల విద్య కోసం కోయంబత్తూరుకు పంపారు. ఆ తర్వాత ఆయన 1904లో మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాల నుంచి తన డిగ్రీని పొందారు.
తదనంతరం, చెట్టియార్ మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. ఆయన మద్రాసు బార్ కౌన్సిల్ ఛైర్మన్‌గా కొనసాగారు.
టి.ఆర్. రామలింగ చెట్టియారుని  భారతదేశంలో సహకార ఉద్యమ పితామహుడిగా అభివర్ణిస్తారు.
చెట్టియార్ మద్రాసు బార్ కౌన్సిల్ ఛైర్మన్‌గా ఉన్న కాలంలోనే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన 1913లో కోయంబత్తూరు జిల్లా బోర్డు ఛైర్మన్‌గా నియమితు లయ్యారు. ఆ తర్వాత ఆయన కోయంబత్తూరు మున్సిపాలిటీ ఛైర్మన్‌గా కూడా పని చేశారు.  
1921లో, చెట్టియార్ మద్రాసు శాసన మండలిలో సభ్యుడయ్యారు. 1939 వరకు ఆ పదవిలో కొనసాగారు.
చెట్టియార్ 1911 నుండి సహకార సంఘాల ఉద్యమంతో సంబంధం ఉండేది. ఆయన తమిళనాడు సహకార సమాఖ్యను స్థాపించారు. ఆయన 'కూట్టురవు' (సహకార) అనే తన మాసపత్రికలో ఈ ఉద్యమాన్ని ప్రోత్సహించారు. 
యువతకు సహకార సంఘాన్ని నడపడం, నిర్వహించడంపై శిక్షణ ఇవ్వడానికి చెట్టియార్ కోయంబత్తూరులో రామలింగం సహకార శిక్షణా సంస్థను స్థాపించారు.
చెట్టియార్ 1946లో మద్రాసు రాష్ట్రం నుండి రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు. 
ఆయన భాష, కుటీర పరిశ్రమలకు సంబంధించిన చర్చలలో ప్రధానంగా చేసుకున్నారు.
చెట్టియార్ 1951లో కోయంబత్తూరు నుండి పార్లమెంటుకు ఎన్నికయ్యారు.
ఇలావుండగా ఆయన 1952లో స్థాపించిన పాఠశాల ప్రభుత్వ సహాయంతో నడుస్తోంది. ఆయన అదే ఏడాదిలో మరణించారు. అనంతరం, చెట్టియార్ వారసులు ఆయన గౌరవార్థం టి.ఎ. రామలింగం చెట్టియార్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ ఆయన పేరుతో ఒక ఉన్నత మాధ్యమిక పాఠశాలను నడుపుతూ, కోయంబత్తూరులోని వివిధ విద్యాసంస్థలకు అనేక స్కాలర్‌షిప్‌లు, విరాళాలను కూడా అందిస్తోంది.

కామెంట్‌లు