అమెరికాలో చికాగో నగరంలో 1893 సెప్టెంబర్ 11న జరిగిన విశ్వ మత సమ్మేళనంలో హిందూమత ప్రతినిధిగా పాల్గొన్న స్వామి వివేకానంద భారతమాత ఔన్నత్యాన్ని, హిందూమత గొప్పదనాన్ని విశ్వవ్యాప్తం చేసి, 132 ఏండ్లు గడచిన విషయం మనకు తెలిసిందే. ఈ మహాసభల తరువాత స్వామి వివేకానంద అమెరికా, యూరప్ లతో పాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో పర్యటించి హిందూమత పరమౌచిత్యాన్ని, మానవాళి ప్రధానంగా యువత కర్తవ్యాన్ని ప్రబోధించారు.
ఇంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న చికాగో నగరానికి సుమారు వేయి కిలోమీటర్ల దూరంలోని వాషింగ్టన్ రాష్ట్రంలో సియాటిక్ లో వెస్ట్ లేక్ స్క్వేర్ లో స్థానిక ప్రభుత్వం, భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానంద నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వ లాంఛనాలతో ఆవిష్కరించి ఆయన పట్లగల గౌరవం, భక్తి, విశ్వాసాలను చాటిచెప్పాయి.
భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి బహూకరించిన వివేకానంద స్వామి నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ప్రముఖ భారతీయ శిల్పి సురేష్ కుమార్ కుమావత్ రూపకల్పన చేసారు.
భారత కాన్సులేట్ జనరల్ ప్రకాశ్ గుప్త, సియాటిక్ నగర మేయర్ కాటే విల్సన్ లు సంయుక్తంగా వివేకానంద స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించగా, ఈ కార్యక్రమంలో కెంట్ మేయర్ డానా రాల్ఫ్, ఆబర్న్ మేయర్ నాన్సీ బాకస్, తుక్విలా మేయర్ టాం మెక్ లియోడ్, కిర్కిలాండ్ మేయర్ కెల్లీ కర్టిన్, నార్మాండి మేయర్ జిమ్మెర్ మాన్ తో పాటు పెద్ద ఎత్తున భారతీయులు, స్థానికులు పాల్గొన్నారు. అమెరికాలో గల స్వామి వివేకానంద విగ్రహాలలో దీనిని ఎత్తైనదిగా పేర్కొంటున్నారు. ఇది విశ్వవ్యాప్తంగా ఉన్న భారతీయులు గర్వపడే ఆవిష్కరణ.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి