తక్కదిన తక్కాదినా: - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
తక్కదిన తక్కాదినా ఆడుతుంటే
సరిగమ పదానిసా పాడుతుంటే
బాగుంటదీ బలే బాగుంటదీ
తీయగుంటదీ మరీ తీయగుంటదీ      ||తక్క||

చకచకా పొలాల్లో తిరుగుతుంటే
గబగబా గడ్డిపై నడుస్తుంటే
మల్లె తోటలో పువ్వులుకొస్తూంటే
గాజులు ఘల్లుఘల్లున మ్రోగుతుంటే    ||తక్క||

ఏటి నీటిలో ఈతకొడుతుంటే
తోటి వారితో ఎకసకాలాడుతుంటే
ఎగిరి ఎగిరి గంతులేస్తుంటే
చక్కదనాలు కనపడుతుంటే          ||తక్క||

చెట్టెక్కి మామిడికాయలు కోస్తుంటే
పండిన రసాలను జుర్రుకుంటుంటే
పుచ్చకాయల ముక్కలు తింటుంటే
పనసపండ్ల తొనలు ఆరగిస్తుంటే      ||తక్క||

ఎర్రని బుగ్గలు తడుముతుంటే
చిలిపి ముద్దులు పెడుతుంటే 
కొంటె సరసాలు ఆడుతుంటే
చిరు నవ్వులను చిందిస్తుంటే        || తక్క||


కామెంట్‌లు