సుప్రభాత కవిత : - బృంద
పడిగాపుల పరీక్షలకు 
ఫలించని నిరీక్షలకు 
కారణమేదో ఉందనుకో 
కలతలు కరగక తప్పదు!

బీడుబారిన  నేలకైనా 
మోడుబారిన  కొమ్మకైనా 
చినుకే తెచ్చు జీవం 
చీకటి కరుగక తప్పదు!

అలసిన మనసుకు 
ఆగిన అడుగుకు 
ఆశే కొత్త ఉత్సాహం 
దూరం తరగక తప్పదు!

దహించే బాధలకు 
వహించే బాధ్యతలకు 
సహనమే సహకారం 
శాంతి కలుగక తప్పదు!

స్వప్నాలన్నీ సత్యాలుగా 
ఊహలన్నీ నిజాలుగా 
క్షణాలన్నీ కమ్మగా 
కలిసి రాక తప్పదు!

వెలుగంత తెల్లగా 
వెన్నెలంత చల్లగా 
వేడుకంత కమ్మగా 
వేంచేయు వేకువకు 

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు