పాండవుల శిబిరాల్ని సర్వనాశనం చేసిన అశ్వత్థామ ,కృపాచార్య కృతవర్మ లతో కలిసి యుద్ధభూమికెళ్లాడు. అక్కడ తొడలు విరిగి నేలమీద పొర్లుతున్న దుర్యోధనుని చూసి పెద్దగా ఏడ్చారు."మహారాజా! నీవు స్వర్గానికి వెల్తావు.నేను పాండవుల శిబిరాల్ని సర్వనాశనం చేసి అందర్నీ చంపాను. " అశ్వత్థామ మాటలకు సంతోషంతో ప్రాణం వదిలాడు.శరీరం నేలపై పడితే పుణ్య లోకంచేరాడు దుర్యోధనుడు.ఈకురుక్షేత్ర సంగ్రామాన్ని వర్ణించిన సంజయుడు ఇలా ధృతరాష్ట్రునితో అన్నాడు" మహారాజా!18రోజుల భారత కురుక్షేత్ర యుద్ధవర్ణన చేశాను.దానికి కారకుడు వ్యాసమహర్షి నాకు దివ్యదృష్టి ప్రసాదించాడు.దుర్యోధనుడు చనిపోయాడు.నాకు ఆదివ్యదృష్టి పోయింది. ఇంక నాకు శక్తి లేదు.ఏమీ చెప్పలేను " అని అన్నాడు.ఇక వైశంపాయనుడు జనమేజయునికి జరిగిన విషయాలు చెప్పసాగాడు. ధృష్టద్యుమ్నుని సారధి ఓఘవతీ నదీతీరంలో ఉన్న పాండవులని చేరుకున్నాడుధర్మ రాజు దగ్గర బిగ్గరగా విలపిస్తూ"ప్రభూ! అశ్వత్థామ సర్వనాశనం చేశాడు" అని వివరించాడు.ద్రౌపది తండ్రి సోదరుల పుత్రుల చావుల్ని ఎలాతట్టుకుంటుందా అని మధనపడ్డాడు. ద్రౌపది పాంచాలము, విరటుని స్త్రీలను ఓదార్చటానికి మత్స్య పట్టణం వెళ్లింది .సుభద్ర ద్వారకలో ఉంది.ధర్మరాజు వెంటనే వారినందరినీ తీసుకురమ్మని నకులుడిని పంపాడు.ధర్మరాజు చనిపోయిన వారందరికీ దహనసంస్కారాలు చేశాడు.ద్రౌపది అందరుస్త్రీలతో కలిసివచ్చి నేలమీద పొర్లి ఏడుస్తూ,అశ్వత్థామ కి సహజంగా ఉన్న శిరోరత్నంని తెప్పించమని రోషంతో బుసలు కొడ్తూ ధర్మరాజుతో అంది🌹
ద్రౌపది శోకము! అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి