నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం ఆధ్వర్యంలో
స్థానిక క్షత్రియ పరిషత్ కల్యాణ మండపం సమావేశ మందిరంలో జరిగిన ఉత్తరాంధ్ర మహిళా సదస్సులో ప్రముఖ రచయిత్రి, గాయని, నటి, సంఘ సంస్కర్త, వ్యాఖ్యాత, తెలుగు భాషాభిమాని, విశ్రాంత ఉపాధ్యాయని చివుకుల శ్రీలక్ష్మికి ఘన సన్మానం జరిగింది.
ఈ వేదికపై బొబ్బిలి రచనా సమాఖ్య రూపొందించిన ఉపాధ్యాయ స్పూర్తి అనే సంకలనాన్ని రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమల గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, ఎన్.ఆర్.ఐ. సాధికారక మరియు సంబంధాల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆవిష్కరించిరి. అనంతరం బొబ్బిలి రచనా సమాఖ్య అధ్యక్షులు మింది విజయమోహనరావు నేతృత్వంలో చివుకుల శ్రీలక్ష్మిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విజయమోహనరావు మాట్లాడుతూ ఈ ఉపాధ్యాయ స్పూర్తి సంకలనం, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపికైన డెబ్బది ఐదు మంది స్వీయ అనుభవాల స్పూర్తి గాథలతో కూడిన సామాజిక స్పృహ ఉన్న గ్రంథమని అన్నారు. అట్టి స్పూర్తి ప్రదాతలను ప్రోత్సహించిన నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చివుకుల శ్రీలక్ష్మిని సన్మానంతో గౌరవించుట తమ బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు. చివుకుల శ్రీలక్ష్మి శ్రీరామాయణ ప్రశ్నోత్తర మాలిక, తమ చరణాలు, సాయి గీతాంజలి, విజయనగర సామ్రాజ్యం దిక్సూచి, తెలుగుతల్లి, ఆదినుండి అనంతం దాకా, శ్రీరామచంద్ర ప్రశస్తి, లేత మనసులు తదితల గ్రంథాలను రచించి, ఎందరెందరికో ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. రాష్ట్ర మంత్రివర్యలైన కొండపల్లి శ్రీనివాస్ నేడు శ్రీలక్ష్మి రచించిన కవన కూజితాలు కూడా ఆవిష్కరణ చేయుట మిక్కిలి గర్వకారణమని విజయ మోహన్ అన్నారు.
కవన కూజితాలు, ఉపాధ్యాయ స్పూర్తి లతో పాటు, మక్కువ అరుణకుమారి రచించిన నా అక్షరాలు పుస్తకాన్ని రాష్ట్ర మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ ఆవిష్కరించగా, తొలి పుస్తకాలను స్వీకరించిన విజయనగరం నియోజకవర్గ శాసన సభ్యులు పూసపాటి అదితి విజయలక్ష్మీ గజపతిరాజుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన అన్నారు. సదస్సుకు హాజరైన అతిథులు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్, పద్మభూషణ్ డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, నరసం రాష్ట్ర అధ్యక్షురాలు తేళ్ళ అరుణ, జిల్లా అధ్యక్షులు చివుకుల శ్రీలక్ష్మి, సహాయ కార్యదర్శి దాసరి పద్మ, గౌరవసలహాదారులు డా.నూనె అంకమ్మరావు, నిర్వాహకులు భోగరాజు సూర్యలక్ష్మి, గుడ్ల అమ్మాజీ, పి.శాంతమ్మ, ఎన్.సంథ్యారాణి, పి.చంద్రికారాణి, డా.జక్కు రామకృష్ణ, కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు డా.జి.వి.పూర్ణచంద్, ప్రముఖ నృత్య దర్శకురాలు డా.భేరి రాధికారాణి, డా.దేవులపల్లి పద్మజ, కొత్తూరు రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి అమ్మల కామేశ్వరి, మర్రాపు వసుంధరాదేవి, నల్ల రవికుమార్ లకు, నవ్యాంధ్ర కీర్తి పురస్కార గ్రహీతలకు, సౌజన్యమూర్తి సత్కార గ్రహీతలకు, కవి సమ్మేళన సాహిత్య సన్మానాలు పొందిన కవయిత్రులకు, బాలసాహిత్యం వినిపించిన బాలికలకు ఈ సందర్భంగా ఉపాధ్యాయ స్పూర్తి రచయితలు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాన సంపాదకులు మింది విజయమోహనరావు, జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావు, డా.పెన్నేటి స్వప్నహైందవి, మానాప్రగడ సాహితి, ఈపు విజయకుమార్, భోగెల ఉమామహేశ్వరరావు, కందల రామకృష్ణారావు, పొట్నూరు మాలతి, ఆర్.వి.రత్నం, రేవళ్ళ సతీష్ రాజు, యడ్ల శ్రీనివాసరావు, ఎస్.తిరుమల తిరుపతిరావు, టేకుమళ్ళ విజయలలిత, కుసుమంచి శ్రీదేవి, సాలూరు సంతోషి, డా.జి.శిరీషారఘురాం, వేమూరి ఉషా రమణి, ఎ.ఎస్.శారద, బి.శారద, దామరాజు విశాలాక్షి, పి.ఆనంద్ కుమార్ తదితర ఉపాధ్యాయ స్పూర్తి ప్రదాతలంతా చివుకుల శ్రీలక్ష్మిని ఘనంగా సన్మానించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి