విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో మిథిలకు బయలుదేరుట :- ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
రామలక్ష్మణులు నిద్ర లేచి స్నానం చేసి 
విశ్వామిత్రుని నమస్కరించినారు 
మునీశ్వర మేము మీ సేవకులము 
తదుపరి కార్యక్రమములను తెలుపగలరు 

ఓ రామ లక్ష్మణులారా వినడు నా మాట 
మిథిలా నగర రాజు అయిన జనకుడు 
యజ్ఞము చేయుటకు సంకల్పించినాడు 
అతడు చాలా ధర్మాత్ముడు 

మనమందరము అచటికి వెళ్ళుదాము 
అచట ఒక మహాదనసు ఉంటుంది 
దానిని నీవు కనులారా చూడవచ్చు 
ఆ ధనువు సాటిలేని శక్తి గలది 

గంధర్వులు అసురులు రాక్షసులు 
దేవతలు సైతం ఎక్కుపెట్ట జాలరు 
ఆ ధనస్సు బలము తెలుసుకొనుటకై 
ఎందరో రారాజులు ప్రయత్నించినారు 

మిథిలా నగరంలో బలమైన ధనస్సును చూసి 
యజ్ఞమును కూడా దర్శించవచ్చు 
చందన పుష్ప సుగందాలతో ధనస్సును పూజింతురు 
త్వరగా చూడాలని రామ లక్ష్మణుల కుతూహలం 


కామెంట్‌లు