****
"ఆఁ యాడుందవ్వా మంచితనం? ఎవలికి ఆళ్ళే అయిన గీ లోకంల "ఎవలికి ఆళ్ళే యమున తీరె"అన్నట్టుంది. "తన కడ్పు నిండితే దరిద్రం బాయె" అనుకునేటోళ్ళు ఒకలు. "ఆఁ నా దనుక రాలేత్తు వొచ్చినప్పుడు సూస్కుందామని ఇంకోలు. గిట్లుంది లోకం."
"ఏంది శెల్లే? లోకంల పరిత్తితి గురించి బుగులు వడవడ్తివి.లోకంల యాడ జూసినా గట్లనే ఉంది తీ. పట్టిచ్చుకుంటే పాపం మీద వడ్తదన్నట్టు జేత్తుండ్రు. పరాయోళ్ళయితే గంత బుగులుండదు గని అయినోళ్ళే గట్ల జేత్తే వుండదా మరి. గింతకీ ఎవలి ముచ్చెటి? ఎవలంత బాద వడవట్టిరి?"
"గదేనవ్వా వొజ్రమ్మవ్వ పరిత్తితి.మన శిన్నతనాన ఎట్లుండె. ఇంటి నిండ వొడ్ల గుమ్ములు,గరిశెలు. కందులు పెసలు శనగలు,పల్లి కాయలు,మినుములు...గిట్ల ఒక్కటనా ఎన్నెన్ని పండిచ్చేటోళ్ళు. వజ్రమ్మవ్వ పొద్దత్తమానం ఏలుముడి ఏస్కొని,పైట, కుచ్చిళ్ళు బొడ్లె దోపి వొండుడు పెట్టుడు పనిమీదనే ఉండేది. గా అవ్వ శేత తినని మడిషి మనూల్లె ఎన్కటి తరమోడు ఎవలన్న ఉండా శెప్పవ్వా?"
"ఎవ్వలు లేరు శెల్లే? ఎప్పుడో ఒకపాలి గా అవ్వ శేత తిన్నోళ్ళే. అందరికీ పెట్టాలని ఎంత కాయుషు పడేదో! వొంట్లె గంతోపిక ఎట్లొచ్చేదో ఏమో! గా అవ్వ కానించి మనం నేర్సుకోవాల్శింది శాన్నే ఉంది శెల్లే!"
గట్ల మనమన్కుంటున్నం గని ఇంట్లె ఎవ్వలన్న గా అవ్వ మంచిని యాజ్జేసుకుంటుర్రా! ఆత్తులన్ని నయా పైసల్తో లెక్క గట్టి పంచుకుర్రు. ఇల్లాకిలి వొదిలేశి పట్నం బడ్డదనుక బోయి నోళ్ళు ఎట్లుందని మంచి శెబర ఎవలన్న అర్సుకుంటుర్రా? ఇటాంకల రాకుండ బొయ్యిండ్రు.
అవ్వకి వొయసు మీదవడె, సూపు సరింగ ఆనదాయె. కాళ్ళుశేతులు సరింగ ఆడని పరిత్తితి వొచ్చే. పని కోసరమే పుట్టినట్టున్న ఒకప్పటి గా అవ్వ గిప్పుడు గాళ్ళ,గీళ్ళ మీద ఆధారపడుడంటెనే ఎట్లనో ఉందవ్వా?'
అవును శెల్లె!నువ్వు జెప్తుంటే ఇన్న నాకే ఎట్లెట్లనో అయితున్నది . ఆర్శె టోళ్ళు లేరు ,తీర్శెటోళ్ళు లేరు - అడుగున బడితే లేవదీశేటోళ్ళు ' అన్నట్టు ఉంది!"
"మరీ ఇదిగని. కాల్జేతులు ఆడట్లేదాయె.పట్నంల వాళ్ళోళ్ళకి సూస్కునే బాద్దెత లేదా? ఏం మడుసులు? పులొతికె బత్కిన వజ్రమ్మవ్వకి మనమున్నమని దైర్నం జెప్దాం. "ఆర్శెటోళ్ళం,తీర్శేటోళ్ళం - అడుగున బడ్తే లేవదీశేటోళ్ళం మనమే అవుదాం పా శెల్లె! గా అవ్వ వొంటి మీద సొమ్ముల కోస్రం రావాలె.ఇంగ వాళ్ళకి ఉన్నదే ఉన్నది. మనమే అవ్వని పువ్వొతికె సూస్కుందాం"అన్న అవ్వ మాటల్కి "మనీడోళ్ళం బొచ్చెడు మందిమిమున్నం గా అవ్వ మనకు బర్వా ఏంది? నువ్వు శెప్పినట్టు శేద్దాం"అంటుంటే అవ్వకి తుత్తి అన్పిచ్చింది.
"గదండీ సంగతి! "ఆర్శేటోళ్ళు లేరు,తీర్శేటోళ్ళు లేరు - అడుగున బడ్తే లేవదీశేటోళ్ళు లేరు అంటే గిదే మరి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి