.....
ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా చిలకలమర్రి జడ్పీ హైస్కూల్ విద్యార్థులు రాసిన చిలకలమర్రి బడి పిల్లల కథలు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం గురువారం మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రంలో జరిగింది. మండల విద్యాశాఖ అధికారులు పద్మనాభం, ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా ఈ పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా కథలు రాసిన విద్యార్థులు పెంచల ప్రసన్న, మల్లిక, సుచిత్ర, హారిక, మహేశ్వరి, వైష్ణవి, ఉపాధ్యాయులు డాక్టర్ మున్నెల్లి శివ శంకరయ్య, కర్మయోగి చల్లా చంద్రశేఖర్ రెడ్డి లను మండల విద్యాశాఖ అధికారులు శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు రాసిన 50 స్ఫూర్తిదాయక కథలను పుస్తక రూపంలో తీసుకురావడం చాలా ఆనందంగా ఉందన్నారు. సాధారణ కథలకు భిన్నంగా విద్యార్థులు విద్య వల్ల కలిగే లాభాలు, ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్ధాలు, పర్యావరణ సమస్యలు, సైబర్ నేరాలు, బెట్టింగ్, మారిన ఊరు, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్ధాలు ఇలాంటి అంశాలను స్ఫూర్తిదాయక కథలుగా రాయడం అద్భుతం అన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్సీ సిబ్బంది, సిఆర్ఎంటి లు పాల్గొన్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి