సామెత -198: ఆవగింజంత సందుంటే -అరవై గారెలు అప్పుడే తిననా...
***
అవ్వా! గా గోపులు గాని ముచ్చెటి శెప్పాలని వొచ్చిన. వాడుట్టి గోడమీద పిల్లి లెక్కంట గద.గిక్కడున్నప్పుడు ఎట్లుండే. కట్టు బట్టల్తో పట్నం ఎల్లినోడు గియ్యాల కట్టలక్కట్టలు సంపాయిచ్చిండంట గద.
"అవును శెల్లే! గిక్కడ డబ్బు కాడ శాలూ శెకలు జెయ్యబోతే తన్నులు దినేదన్క వొచ్చిండు. శెరంతో "సూడుండ్రి మీరంత ముక్కునేలేస్కొనేటట్టు సంపాదిత్త అన్కుంట పట్నం ఎల్లిండు గద? గట్ల బొయ్యినోడు గిట్ల గిన్ని కోట్లు సంపాయిచ్చిండంటే బాగనే సోంచాయించాలె. అడ్డ దార్లయితెనే గంత గనం సంపాయిచ్చగల్గుతడు. నాయం దర్మంగ గంత కూడా బెట్టడం ఎవలి వల్ల గాదు శెల్లే!"
"అవును మస్తు మాటల గారడీ శేత్తడవ్వో! గట్ల శానామందిని బురిడీ కొట్టిచ్చిండు గాబట్టే గంత గనం సంపాయిచ్చి ఉంటడు."
అవును శెల్లే! గాని మాటల గారడి అంతింత గాదు.మొన్న మాయింటికి వచ్చిండు.రాకరాక వొచ్చిండు గదాని ఇంట్లె గారెల పిండి ఉంటే గారెలు శేసి పెట్టిన."
అర డజను గారెలు తిన్నడు. శాయ జేసిపోత్తనని లేత్తుంటే. "అవ్వా! శాయొద్దు ఏమొద్దు."ఆవగింజంత సందుంటే ఆరు గారెలేం ఖర్మ ఇంకా అరవై గారెలు తినేటోన్ని. గంతకి ముందే రామక్కింట్ల తినొచ్చిన అన్కుంటనే వొద్దని పక్కన బెట్టిన వాట్లనించి మల్లో నాలుగు తీస్కొని తిన్నడు.గా తిండి సూత్తెనే గాని యిష్యం పురాగ సమజైంది శెల్లే!'‹"
"అవునా అవ్వా!గంత ఆశపోతు గాడా! అవున్లే గాడు సంపాయిచ్చిన సంపాదన సూత్తెనే ఎవ్వలికైన తెలుత్తది.
"అవును శెల్లే! సచ్చెం బల్కినవ్! గాడు "ఆవగింజంత సందుంటే అరవై గారెలు అప్పుడే తిననా! అనడంలనే గాడికెంత ఆశుందో, ఎంతెంత కూడేశిండో తెలుత్తుంది. అయితే గీ సామెతను రొండిదాలుగా అంటరు పెద్దోళ్ళు.
గట్ల అత్తాశతో సంపాయిచ్చినోన్ని గురించి అంటరు. "ఇంగ మనం ఇంటి కాడ పొట్లెంగ తిని ఎవలింటికన్న బొయినప్పుడు గట్ల మనకిట్టమైనయి తింటానికి బెట్టిండ్రనుకో... తినాలనే ఆశె ఓ వైపు తిన్లేని పరిత్తితి మరో వైపు ఉన్నప్పుడు". పెట్టినోళ్ళు పేమగా తిన్మని బతిలాడినప్పుడు గీ సామెత ఉపయోగిత్తం శెల్లే!"
అవునా అవ్వా! మొత్తానికి గోపులుగాడి అత్తేశ బుద్ధిని, మనం తిన్లేని పరిత్తితిని కలిపి గీ సామెత బలే శెప్పినవ్ అవ్వా!"
గదండీ సంగతి."ఆవగింజంత సందుంటే- అరవై గారెలు అప్పుడే తిననా'' అంటే గిదే మరి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి