జ్ఞాన మనంతం బ్రహ్మ! : - కోరాడనరసింహారావు
ఒకరు...,జీవుడు వేరు... 
దేవుడు వేరు... 
  జీవుడు దేవునికి విధేయుడై బ్రతుకును సార్ధకం చేసుకోవాలి అం టే...., 
 ఇంకొకరు...,జీవుడు దేవుడు వేరు కాదు... 
 ఈ సత్యాన్ని తెలుసుకుని 
   జీవుడు తన జన్మను సార్ధకం చేసుకోవాలి అన్నారు...! 
   మరొకరు...., జీవుడు దేవుని యొక్క అంశయే,
  ఈ నిజాన్ని గుర్తెరిగి పవిత్ర జీవన విధానంతో 
 జీవుడు తన నిజ స్థితిని చేరు కోవాలి అన్నారు...! 
  
వీ టి లో ఏది  సత్యం !? 
ఎవరు నిజమైన మహాత్ములు...?! 
  అంటే... 
పై మువ్వురూ మహాత్ము లే...., ముగ్గురు చెప్పినది సత్యమే...! 
 మనం మన స్థాయిని బట్టి... ఎవరి కేది అను కూలమో , దానిని ఆచ రించి తరించ వచ్చు...! 
  ద్వైత, అద్వైత, విశిష్ఠ అద్వైత ములు మూడు ను సత్యమే...! 
  మువ్వురును మహా పురుషులే...!! 
  జ్ఞాన మనంతం బ్రహ్మ! 
 ఏ కం సత్యం విప్రా బహుదా వదంతి...!! 
      ******

కామెంట్‌లు