అందరూ పిల్లలు రారడి
హైదరాబాదు చేరండి
ఆమీన్ పూర్ చెరువులో
గుర్రం డెక్క ఆకుల మీద
అది రాగి రంగు రెక్కలతో
పొడవైన కాళ్లతో నడుస్తూ
దాని చిట్టి పొట్టి పిల్లలతో
ఆహారము కొరకు తిరుగుతూ
ఆడ మగ పక్షులు కలిసే
కొలనులో నివాసం ఉంటూ
గుడ్లు పెట్టి పిల్లలను చేసి
వాటి సంతానోత్పత్తి చేస్తాయి
అచట పిల్లల సంరక్షణ
మగ పక్షులు చూస్తాయి
వాటి ఆహారం ఏమిటో తెలుసా
నీటిలో నత్తలను తింటాయి
ఆ పక్షుల పేరు మీకు తెలుసా
ఈ పక్షుల పేరు జకానా అంటారు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి