ఎంతో ఎత్తుకు......! : - కోరాడ నరసింహా రావు
సృష్ఠి సమస్తము శోధించి
 ప్రతి వస్తువును పరిశోధిం చి... 
   తన సుఖ జీవనమున కుపయోగించిన ఘనత కేవలము,ఈ మనిషిదేకద
ప్రాణికోటిలో శ్రేష్టతములు 
 ఈ మానవులన్నది నిజమే కదా...! 

కూ డు, గుడ్డ, తెలియని వారు... 
  గూడు లేకనే బ్రతికిన వారు.... 
 సంచార జీవులై తిరిగిన వారు.... 
  పశువులు, పక్షులు, జంతువుల వలె 
 చీకటిలోనే ఉండే వారు
  రాయి, కర్రె ఆయుధా లుగా ఎరిగిన వారు
  నిప్పును తెలుసు కున్నా రు, ఇనుమును కనుగొన్నారు ! 

వ్యవసాయం మొదలు పెట్టారు 
 స్థిర నివాసులే ఐనారు
  లోహపు చక్రం తిప్పారు లోకం చుట్టి వచ్చారు! 
 
సముద్రపు లోతులు చూ సారు... 
 గగన తలాన్నే తాకారు ! 
విను వీధుల విహరించారు... 
 గ్రహాలగుట్టును విప్పారు!

ఇన్నీ తెలుసుకుని  తమనుతాము మరిచారు
ఎంతో ఎత్తుకు ఎదిగిన వారు.... 
పా తా ళ  లోతులకు దిగ జారి పోయారు...!! 
     *******

కామెంట్‌లు