వెల కట్టలేనిది ,
విలువలు తగ్గనిది,
కులమతాలకు_
అతీత మయినది,
ధనిక బీద తేడా తెలియనిది, స్వార్థమునకు తావు లేనిది ,
త్యాగమునకు వెనుకాడనిది,
ఔషధం వలె పని చేసేది ,
కష్టకాలం లో ఊరట నిచ్చేది ,
ఎంత ఒత్తిడి నైనా తగ్గించేది,
నేనున్నాననే భరోసా నిచ్చేది,
చెప్పుడు మాటలకు _
చెక్కు చెదరనిది,
పెద్దా చిన్నా తేడా తెలియనిది,
మనో ధైర్యాన్నిచ్చి _
ముందుకు నడిపించేది ,
ప్రాంతీయ భేదం లేనిది,
దురాంతరాలు తెలియనిది,
చీకూ చింతలను దూరం చేసేది ,
కడ వరకు తోడుగా ఉండేది ,
కలలో కూడా వెంటాడేది ,
కలత నిద్రలో గుర్తుకు వచ్చేది ,
బాషా భేదములు తెలియనిది ,
బేషజాల జోలికి పోనిది ,
అది ఒక్కటి మాత్రమే !
అదే స్నేహ బంధం _
వెలకట్టలేని అనుబంధం!!
***
అనుబంధం...!!: - ఎనుముల వేణుగోపాలరావు- అమలాపురం.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి