కామరూపిని అయిన రాక్షసి
రామలక్ష్మణులకు కనబడకుండా
వారిపై రాళ్ల వర్షము కురిపిస్తుంది
రామా దుర్మార్గురాలిపై నీ కరుణ చాలించు
అది ఇలా కనులకు కనపడకుండా
యజ్ఞమునకు విజ్ఞములను కలిగించవచ్చు
సంధ్యాకాలం సమీపిస్తుంది రామ
ఈలోపే ఆమెను హతమార్చమయ్యా
రాక్షసులు సంధ్యాకాలంలో బలపేతులవుతారు
రాముడు విశ్వామిత్రునితో నడుస్తూ
శబ్ద వేది విద్యతోబాణాలను ప్రయోగించి
తమపై పడే రాళ్లను ఆపినాడు రాముడు
పిడుగు వలె తాటక రాముడిపైకి వస్తుంది
రాముడు చూసి ఆమె వక్షఃస్థలముపై బాణాలు వేసినాడు
వెంటనే నేలపై పడి ప్రాణాలు కోల్పోయినది
రాముడామెకు ఈ విధముగా ముక్తిని ప్రసాదించాడు
దేవతలందరూ రాముడిని పొగిడినారు
వారంతా తాటక వనములో ఆ రాత్రి గడిపినారు
ఆ వనమునకు శాప విముక్తి కలిగినది
దేవతల మునుల దీవెనలు పొందినాడు రాముడు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి