ఏకత్వంలోంచే అసాధారణం జరుగుతుంది.
భిన్నత్వంలో నుంచి కాదు.!?
రొటీన్ లోంచి నూతనత్వం వస్తుంది. భిన్నత్వంలోంచి కాదు.!?
మూసలోంచే మనిషి పుట్టిండూ ప్రమాణా ల్లోంచి కాదు.
మనిషిలోంచి మనిషి పుట్టినట్టు
నమూనాల్లోంచే నమూనాల పుట్టుకను తెలుసుకుంటాం.
మామూలు పరిస్థితుల్లోంచే మూలాలు కనిపెట్టబడతాయి.
ఒకే చూపు
ఒకే వినికిడి
ఓకే నడక
ఒకే ఆలోచన
ఒకే స్థలము
ఒకే పద్ధతి
ఓకే అనుభవము
ఓకే అనుభూతి
మరో కొత్తదవుతుంది. కొత్త లోంచి కొత్తది కాదు.
ఉన్నదాంట్లోంచే ఉద్భవించేదే కొత్తది
అదే ఉత్తమమైనది ఉన్నతమైనది.
మామిడి శ్రీహరి
బీటెక్ ఫైనల్ ఇయర్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి