శయ్య పర్వం! అచ్యుతునిరాజ్యశ్రీ

 భీష్మ ద్రోణ కర్ణుల చావుతో దుర్యోధనుడు దిగాలుపడ్డాడు. కృపాచార్యుడు వచ్చి"దుర్యోధనా! ఇప్పటికైనా సంధి చేసుకో.మనమెవరం పాండవులను ఎదిరించి గెలవలేము" అని అంటే" దుర్యోధనుడు విసుక్కున్నాడు" ధర్మ రాజుని బిచ్చమడగను. భీమునికి భయపడి దాసోహం అని సంధికొచ్చాడు  అని అంతా హేళన చేస్తారు.రాజ్యం అవిభాజ్యం వీర భోజ్యం" అని మొండికెత్తాడు. ఆపై సరస్వతీతీరంలో అంతా సేదతీరారు. అశ్వత్థామ సలహాపై  శల్యుని సేనాపతిగా చేశాడు.సరస్వతీనదీ జలాలతో సేనాపతి పట్టం కట్టాడు. ధర్మ రాజు కృష్ణునితో అంటాడు" నీవే మారక్షకుడవు. "" ధర్మరాజా! శల్యుడు మీకు మామ,కానీ ఇప్పుడు శత్రుపక్షంలో ఉన్నాడు.అతడిని నీవే చంపితీరాలి." శల్యుడు సర్వతోభద్రవ్యూహం రచిస్తే, ధర్మరాజు త్రిభుజాకార వ్యూహంతో ఎదుర్కొన్నాడు. నకులుడు కర్ణుని కొడుకులు చిత్ర సేనుడు,సత్యసేనుడు సుశర్మలను చంపేస్తాడు.సహదేవుడు, శల్యపుత్రుని తలనరికేస్తాడు. భీమునితో  పోరిన శల్యుని పరాక్రమం ధర్మ రాజు జంకాడు. కానీ శ్రీకృష్ణుని మాట నిలపటంకోసం ముక్కంటిని ప్రార్ధించి శల్యుని రొమ్ము బద్దలుకొట్టాడు. ఆతర్వాత  సాత్యకి చేతిలో సాల్వుడు చచ్చాడు. ఇక దుష్టుడైన శకుని సహదేవుని చేత రెండుచేతులు నరకబడి  ఆపై హాహాకారాలతో ప్రాణాలొదిలాడు.అతని కొడుకు  ఉలూకుడు గూడా సహదేవునిచేతిలో తలనరకబడి నేలరాలాడు.11అక్షౌహిణుల కౌరవ సేన మొత్తం అంతమైంది. ఒంటరిగా దుర్యోధనుడు  మిగిలాడు🌷
కామెంట్‌లు