క్రీడల్లో రాణించిన బాలికలకు సన్మానం : వెంకట్ , మొలక ప్రతినిధి

 వికారాబాద్ జిల్లా తాండూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం బాలికలు గత మార్చిలో ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో జరిగిన జాతీయస్థాయి షూటింగ్ బాల్ క్రీడల్లో బ్రాంజ్  మెడల్స్ , రాష్ట్రస్థాయిలో వెండి పథకాలు సాధించిన ఆర్. ఇందు, ఆర్. శ్వేత, విజయ్ శ్రీ, టి. భాగ్యశ్రీ, ఎం. నికిత బాలికలను ఈనెల 16న తాండూరు పట్టణంలో రాష్ట్ర షూటింగ్ బాల్ ఉపాధ్యక్షుడు బి.గోపాలం, పాఠశాల స్పెషల్ ఆఫీసర్ ఆశాలత బాలికలను శాలువా మెడల్స్ అందజేసి ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా బి.గోపాలం మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే బంగారు భవిష్యత్తు ఉంటుందని స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు లభిస్తాయి అని ఆయన తెలియజేస్తూ మునుముందు జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలని తెలియజేశారు .పాఠశాల స్పెషల్ ఆఫీసర్ ఆశాలత మాట్లాడుతూ మా పాఠశాల విద్యార్థులు క్రీడారంగంలో రాణిస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ , క్రీడల కొరకు కృషి చేస్తున్న మా పాఠశాల పి ఈ టి బాలమణి పి అభినందిస్తూ,క్రీడల కొరకు పూర్తి సహకారం అందిస్తానని ఆమె తెలిపారు. పాఠశాల పి ఈ టి బాలమణిని ఘనంగా సన్మానించి అభినందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం స్పెషల్ ఆఫీసర్ ఆశలత , సవరూప రాణి , శైలజ , సులోచన , జరీనా , వాణిశ్రీ, హేమలత, భాగ్యమ్మ, పిఈటి బాలమణి, శ్రీదేవి,సుమలత,   ప్రమీల, శిరీష ,సవిత ,సంధ్య ,రాగిణి, గౌరమ్మ ,మంజుల స్వాతి విద్యార్థులు పాల్గొన్నారు.

కామెంట్‌లు