బాలకాండము శ్రీమద్రామాయణం : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
దేవతలు దానవులు గంధర్వులు 
యక్షులు గరుత్మంతుడు నాగులు మొదలగు వారు 
రణములో రావణుని ఎదురుకొనలేరు 
రణ భూమిలో అందరి శక్తిని క్షీణించే శక్తి కలిగినవాడు 
మానవులము మేమేమి చేయగలము స్వామి 

నేను నా సైన్యముతో కానీ 
నా పుత్ర సమిష్టితో కానీ 
ఆ రావణుడిని ఎదుర్కొనే శక్తి లేదు 
ఓ బ్రహ్మర్షి నా కుమారుడు దైవ సమానుడు 
యుద్ధ విద్య లందు ఆరితేరిన వాడు కాదు 
అతడిని నేను పంపలేను ఓముని వర 

యజ్ఞమునకు విజ్ఞములను కలిగించు వారు 
మారీచ సుబాహులు యములతో సమానము 
వారిని నా పుత్రుడు వధించగలేడు 
నా ముద్దుల బిడ్డను నీ వెంట పంపించలేనయ్య 

ఆ మారీచ సుబాహులు మిక్కిలి బలవంతులు 
కదనరంగమున కాకలు దీరిన వారు 
వారిలో ఒక్కరినైనా నేను కూడా వధించలేనయ్య 
అట్టి వారిని నా రాముడు ఎలా వధించగలడు 

దశరథుని పలుకులు విన్న మునీశ్వరుడు 
కుశికునివంశమువాడు మహా పురుషుడు 
విశ్వామిత్రుడు అగ్రహోద్రుడై రగులుతూ 
ఎగిసి పడే జ్వాలలా దశరథునిపై మండిపడ్డాడట


కామెంట్‌లు