సుప్రభాత కవిత : - బృంద
కలతలతో పోరాటం తర్వాత 
కమ్మగ దొరికే హాయిలా 
చీకటిని తరిమేసిన తరుణం 
లోకానికి దొరికే సంతోషం

కష్టాలకు భయపడినా 
ఇష్టాలను వదులుకున్నా 
ఏమీ మారవు  మనము తప్ప 
ఏదీ మారదు మనసు తప్ప!

మమత నిండిన మనసుకు 
మధురమేగా బ్రతుకు!
మనసు నిండిన బ్రతుకునకు 
మధురమేగా జగతి!

నచ్చని విషయం వదిలేసి 
నొచ్చిన క్షణాలు మరిచి 
వచ్చినవే నావి అనుకుని 
మెచ్చేలా నడవడమే బ్రతుకు!

పచ్చగ నవ్వే ప్రకృతి కూడా 
శిశిరంలో ఆకులు రాల్చదా?
వసంతం కోసం ఎదురు చూడదా?
వెలుగు నీడలు పడుగూ పేకలు!

నమ్మిన ధర్మం  నీడ 
నడిపించే  దైవం తోడు 
చక్కని క్రమశిక్షణ నేర్పగా
గురువుగా వచ్చే వేకువకు 

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు