బాల రామాయణం: - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
రామా నీ చరిత రాసేదన్నయ్య 
ఆజ్ఞ నాకు ఇవ్వు మయ్యా రామా 
అందరి వాడవు నీవయ్యా 
ముందుకు నన్ను నడుపయ్య 

ముగ్గురు భార్యలతో కలిసి
అయోధ్య నేలే దశరథుడట 
పుత్ర కామేష్టూ పూజ చేసే నట 
నలుగురు పుత్రులను కనెనట 

కౌసల్య తనయుడు రాముడు 
సుమిత్ర తనయులు లక్ష్మణ సత్రజ్ఞులు 
కైకేయి పుత్రుడు భరతుడు 
దశరథ పుత్రులు నలుగురు

విద్యాబుద్ధులు నేర్చుటకై 
వశిష్టుని చెంతకంపెనట
నలుగురు పిల్లలు వారు 
హాయిగా విద్యలు నేర్చిరట 


కామెంట్‌లు