రాముని పంపుటకు తన అసక్తతను ప్రకటించుట : ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
ఓ మహర్షి విశ్వామిత్ర వినుమయ్యా 
పసి బాలుడు శ్రీరాముడు 
బలవంతులైన రాక్షసులను వధించగలేడయ్యా 
నా సైన్యముతో మీ వెంట వస్తాను మునివరా 

ఓ మునీశ్వర నా బొందిలో ప్రాణం ఉన్నంతవరకు 
రాక్షసులతో పోరాడి వదిస్తానయ్య 
రాముడు యుద్ధ విద్యలు పూర్తిగా నేర్వలేదయ్యా 
శత్రువుల బలములను గుర్తించ జాలడు 

అశ్వమేధ పుత్రకామేస్త్రి యజ్ఞములను 
ఆచరించిన ఫలితముగా పుట్టిన పుత్రుడు 
ఆ పసి బాలుడిని మీరు కోరుట తగదు స్వామి 
జ్యేష్ట పుత్రుడు రాముని తీసుకొని పోవుట తగదయ్య 

దశరథుని వచనములను విని విశ్వామిత్రుడు 
ఏమని పలుకుతున్నాడో వినండి జనులారా 
రావణుడు అనే రాక్షసుడు 
పౌ లస్త్వవంశంన జన్మించినాడు 
అతి మిక్కిలి బలవంతుడతడు 

అతడు వరగర్వముతో ముల్లోకాలను బాధిస్తున్నాడు 
ఆ రావణుడు విశ్రవసుడు అనే ముని పుత్రుడు 
కుబేరునికి సోదరుడు మహావీరుడు 
యజ్యజ్ఞ ధ్వంశములోఅతడు స్వయంగా పాల్గొనుట లేదు 

మారిచూడు శుభాహు అణు మహాబలశాలులు 
యజ్ఞ విజ్ఞములను కలిగించుచున్నారు 
అంత బలశాలులైన రాక్షసులను 
వధించుట నీ వలన కాదు దశరథ 

నేను వధించలేని రాక్షసులను 
ముక్కుపచ్చలారని రాముడు ఎలా వధించునయ్యా
పసివాడైన నా పుత్రుడిని మీరే అనుగ్రహించండి 
దశరథుడు ఎంతో దయానియంగా వేడుకుంటాడు 


కామెంట్‌లు