పాలఖండ్యాం పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవం

 ప్రభుత్వ బడిలో చేరండి బంగరు భవితను పొందండి అని సంతవురిటి పాఠశాలల సముదాయం ఛైర్మన్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.వెంకటరావు అన్నారు. 
పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాల ప్రధానోపాధ్యాయని ఆర్.ఎల్.కుమారి అధ్యక్షతన జరిగిన వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చదువుల స్థాయిని పెంచేలా అనేక పథకాలు అమలు చేయడం జరుగుతుందని 
అన్నారు. ప్రధానోపాధ్యాయని ఆర్.ఎల్.కుమారి మాట్లాడుతూ ఎఫ్.ఎల్.ఎన్, తర్ల్ వంటి కృత్యాధార బోధనలతో పాటు డిజిటల్ ద్వారా పలు అంశాలపై అవగాహన కల్గించడం జరుగుతుందని, అదనపు సమయాల్లో గ్రంథాలయ పుస్తక పఠనం గావిస్తూ విద్యార్థుల చదువుల స్థాయిని పెంపొందిస్తున్నామని అన్నారు. 
ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు మాట్లాడుతూ మన ఊరి బడిని మనమే బలోపేతం చేయాలని, పెద్ద ఎత్తున విద్యార్థులను బడిలో చేర్పించాలని అన్నారు. ఉపాధ్యాయులు ఉప్పలపాటి ఆదిలక్ష్మి పాఠశాల నివేదిక వినిపించారు. ఉపాధ్యాయులు యెందువ వెంకటరమణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల ఆవశ్యకతను వివరించారు. ఉపాధ్యాయులు వెలగాడ రాము వ్యాఖ్యాతగా వ్యవహరించి ఆద్యంతం సభను ఆసక్తికరంగా నిర్వహించారు. ఉపాధ్యాయని ముల్లు సుజాత తాను రూపొందించిన బోధనాభ్యసనా సామగ్రిని ప్రదర్శించారు. ఉపాధ్యాయులు ఎం.పెంటయ్య, జిఎంఆర్ విఎఫ్ వాలంటీర్ పిల్లల దాలమ్మ తదితరులు ప్రసంగించారు. అనంతరం విద్యార్థిణీ విద్యార్థులు   ప్రదర్శించిన ఇరవై ఐదుకు పైగా సాంస్కృతిక నృత్య రూపకాలు సభాసదుల ప్రశంసలు పొందాయి. 
దేశభక్తి, ఆద్యాత్మిక, జానపద, అభ్యుదయ భావాలతో కూడిన కళారూపాలు ఇందులో చోటు చేసుకుని అందరినీ మిక్కిలి రంజింపజేసాయి. పాలఖండ్యాం పాఠశాల ప్రగతికి అనునిత్యం సహకరిస్తున్న జిఎమ్ఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ జనరల్ మేనేజర్ కె.జయకుమార్, ప్రోగ్రామ్ మేనేజర్ వై.సాయికిశోర్ లకు ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు సభాముఖంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇదే వేదికపై గౌరవ అతిథులుగా విచ్చేసిన జిఎంఆర్ విఎఫ్ సిఎస్ వింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ లు లావేటి రాజు, పి.గోవిందలను, పాఠశాల ఉపాధ్యాయులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. పాఠశాలలో ఎనిమిదవ తరగతి ప్రథమ ర్యాంకర్ బత్తుల లిఖిత పాఠశాల వీడుతున్న సందర్భంగా ఉపాధ్యాయులు ఎనిమిది మందికీ ప్రత్యేక బహుమతులను బహూకరించి తన కృతజ్ఞతలు చాటుకొంది. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్మన్ చాంతాటి లక్ష్మి, సంతవురిటి పాఠశాల ఉపాధ్యాయులు జి.వెంకటరావు, సి.హెచ్.కరుణాకరరావు, పి.రమేష్, ఎస్.ఎం.సి.సభ్యులు బత్తుల రామలక్ష్మి, అలజంగి అరుణ, అంగన్వాడీ కార్యకర్తలు కుప్పిలి లక్ష్మి, కె.శాంతి, ఉరిటి సౌజన్య, బాలబడి నిర్వాహకురాలు డి.జ్యోతి, గ్రామ పౌరులు కె.వెంకటసీతారాం, డి.లక్ష్మి, పలిశెట్టి చంద్రమ్మ, చిర్రా లక్ష్మి, సి.హెచ్.అలివేలు, పి.శ్యామల, చేబోలు నాగమణి, కెల్ల ధనలక్ష్మి, లోపింటి స్వప్న, చిర్రా ఢిల్లీశ్వరి, పి.పూజశ్రీ, పి.ఇందు, బత్తుల ఆదిలక్ష్మి, ఆర్.స్వాతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మిఠాయి పంపకం జరిగింది.
కామెంట్‌లు