వికారాబాద్ జిల్లా యాలాల మండల ఎంఈఓ ఎస్. మహిపాల్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకులు డాక్టర్ ఈ. నవీన్ నికోలస్, ఐఏఎస్ సన్మానించి అభినందన పత్రం అందజేశారు. యాలాల మండలంలో నిర్వహించిన టాలెంట్ సర్చ్ టెస్ట్ విజయవంతంగా సాగిన నేపథ్యంలో ఈ గౌరవం లభించింది.యాలాల మండలంలోని 53 ప్రాథమిక పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతున్న సుమారు 600 మంది విద్యార్థులకు టాలెంట్ సర్చ్ టెస్ట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్ రమేష్ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకులకు తెలియజేయడంతో, మంగళవారం హైదరాబాద్‌లోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయానికి మహిపాల్ రెడ్డిని పిలిపించి శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా డాక్టర్ నవీన్ నికోలస్ మాట్లాడుతూ, యాలాల మండలంలో విజయవంతంగా నిర్వహించిన ఈ టాలెంట్ సర్చ్ టెస్ట్‌ను రాబోయే విద్యా సంవత్సరంలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో అమలు చేయడానికి పరిశీలిస్తామని తెలిపారు. మండలానికి కీర్తి తీసుకొచ్చిన మహిపాల్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌సీఈఆర్టీ ఫ్యాకల్టీ సభ్యులు ED మధుసూదన్ రెడ్డి, యాసీన్, యాలాల మండల ఆర్పీ మురారి మొలక తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంఈఓ మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, టాలెంట్ సర్చ్ టెస్ట్ ద్వారా విద్యార్థుల్లో ప్రాథమిక సాక్షరత మరియు సంఖ్యాజ్ఞానం (FLN) సామర్థ్యాలను పెంపొందించడానికి దోహదపడుతుందని తెలిపారు. ప్రీ-ఫైనల్ పరీక్షల తరహాలో విద్యార్థుల్లో మెళుకువలు పెంచేందుకు ఇది ఉపయోగపడుతుందని, రాష్ట్ర స్థాయిలో ప్రతి పాఠశాలలో ఈ పరీక్షను అమలు చేయాలని విద్యాశాఖను కోరారు.
ఈ గౌరవం సాధించడానికి సహకరించిన యాలాల మండల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఎంఆర్సీ సిబ్బంది, ఆర్పీలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు, జిల్లా మరియు రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి