దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్య--మగువ: - -- మంజుల పత్తిపాటి
దివి నుంచి భువికి దిగివచ్చి
మగువలకు సముచిత స్థానం ఇచ్చి
గౌరవం పంచే వేళలో
దేవపారిజాతమై వికసించేది
ఆ మగువే…!
మనసు మధురమై ప్రేమకావ్యమై
పరవశించే ప్రతి క్షణంలో
అమావాస్యలను అంతం చేస్తూ
పున్నమి వెన్నెలై వెలిగేది
ఆ చందకళ మగువే…!
చినుకు రాగాలతో ఒళ్లు తుళ్ళింతలై
మదిని మృదువుగా తడిపే వేళలో
జీవితాన్ని జలజలమని నింపేది
ఆ చందకళ మగువే…!
వాగులు వంకలు సవ్వడి చేస్తూ
పిల్లగాలులు చిలిపిగా హృదయాన్ని తట్టిలేపగా
ప్రకృతే పరవశించే ఆ క్షణంలో
దేవకన్యగా భువికి దిగివచ్చేది
ఆ మగువే…!
నిండుమనసుతో హృదయరాణిగా
స్వాగతం పలికిన ప్రతి ఇంటిలో
సుఖసంతోషాలను వెంటబెట్టుకుని
దివి నుంచి భువికి దిగివచ్చే
దేవకన్య… ఆ మగువే…!

ఆమె నవ్వు ఇంటికి దీపం
ఆమె కన్నీరు సమాజానికి నిశ్శబ్ద ప్రశ్న…
మగువ ఎదిగితే దేశం ఎదుగుతుంది…
అందుకే మనం మాటిచ్చుకుందాం—
ప్రతి అడుగులో ఆమెతోనే నడుస్తాం…
మగువను గౌరవించడం నేర్చుకుని
మన మనసును మనమే గెలుస్తాం.
===================================
-

మంజుల పత్తిపాటి( కవయిత్రి)
ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ  డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
 చరవాణి 9347042218.
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
ఆమె నవ్వు ఇంటికి దీపం....
ఆమె ఏడుపు సమాజానికి నిశ్శబ్దపు ప్రశ్న ( శాపం)
మంజుల మేడం ఏ అంశం మీద శీర్షికలు, కవితలు రాసినా కూడా సమాజాన్ని మేల్కొలిపే విధంగా ఆలోచించే విధంగా సరళమైన పదాలతో ఎంతో అర్థవంతంగా ఉంటాయి థాంక్యూ సో మచ్ మేడం...💐