మలయశ్రీ జై శెట్టి రమణయ్య లకు ఘన నివాళులు

  రెండు నెలల కాలంలో  సమాజం ఇద్దరు గొప్ప వ్యక్తులను కరీంనగర్ జిల్లా సాహిత్య చరిత్ర పరిశోధకులు మలయశ్రీ, కరీంనగర్ జిల్లా చరిత్ర పరిశోధకులు జైశెట్టి రమణయ్యలు పరమపదించడం సాహిత్య మరియు చరిత్రలకు తీరని లోటని తెలంగాణ వివేక రచయితల సంఘం అధ్యక్షులు డాక్టర్ వాసవేణి పర్శరాములు అన్నారు. 2026 ఏప్రిల్ 23రోజున ఎల్లారెడ్డిపేటలో తెలంగాణ వివేక రచయితల సంఘం ఆధ్వర్యంలో వారి ఫోటోలకు పూలమాలలు వేసి నివాళులు తెలిపారు. 
     ఈ సందర్భంగా తెలంగాణ వివేక రచయితల సంఘం అధ్యక్షులు డా. వాసరవేణి పర్శరాములు మాట్లాడుతూ మలయశ్రీ  1940లో కరీంనగర్ జిల్లా చెంజర్లలో పుట్టారని, కష్టపడి ఉన్నత విద్యావంతుడిగా ఎదిగి లెక్చరర్ గా బోధన చేశారని, శాంతిపథం, మానవగీతి, సత్య సూక్తం, రంగుల పిట్టలు ఐరేణికుండలు చుక్కల లోకం మొదలగు పుస్తకాలు రచించారని, కరీంనగర్ జిల్లా తెలుగు సాహిత్య చరిత్ర అంశంపై పరిశోధన చేసి పుస్తకం వెలువరించారని, 2026 ఏప్రిల్ 10న పరమ పరమపదించారని ఆయన మరణం తీరని లోటు అన్నారు .
       అదేవిధంగా జైశెట్టి రమణయ్య 1939లో జగిత్యాలలో జన్మించారని,  అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేశారని, చరిత్ర పై పరిశోధనలుచేసి అనేక చరిత్ర పుస్తకాలను రచించారని, "కరీంనగర్ జిల్లాచరిత్ర" పై పరిశోధన చేసి పుస్తకం వెలువరించారని, 1996లో పదవి విరమణ పొందారని, 2026 మార్చి 27న పరమపదించాలని అన్నారు ఇద్దరు మహనీయులు మరణించడం తీరని లోటు ఆవేదన వ్యక్తం చేశారు.
        ఈ నివాళి కార్యక్రమంలో తెవిరసం అధ్యక్షులు డా. వాసరవేణి పర్శరాములు, జిల్లా కార్యదర్శి దుంపెన రమేష్, గజభీంకార్ అజయ్, యాసరేణి రాజు, నక్క సాయి చరణ్, డి.నాగరాజు, దుంపెన హరికన్న తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు