సబ్జా గింజలు: - -డా.. కందేపి రాణీప్రసాద్
సబ్జా గింజలండీ సబ్జా గింజలు 
సలసల కాగే ఎండలో చల్ల బరిచి
సహాయం చేసే సబ్జా గింజలు

శరీరానికి చలువ చేయును 
శక్తివంతమైన పోషకాలిచ్చును 
యాంటీ ఆక్సిడెంట్లు ఉండును 
సబ్జా గింజలండీ! సబ్జా గింజలు

చర్మం జుట్టు మెరయును 
చక్కెర స్థాయి నివారించును 
ఆకలి ప్రేనియంత్రణ చూపును!
సబ్జా గింజలండీ! సబ్జా గింజలు 

జీర్ణక్రియను మెరుగు పరుచును 
జాస్తి బరువు పొట్ట తగ్గించును 
ప్రేగు కదలికలను సరిచేయును 
సబ్జా గింజలండీ! సబ్జా గింజలు

గుండెలో మంటను తగ్గించును
గుండెను ఆరోగ్యంగా ఉంచును 
కొలెస్ట్రాల్‌ను కత్తిరించును 
సబ్జా గింజలండీ! సబ్జా గింజలు 

పీచు పదార్ధం ఉండును 
పోషకాలు పుష్కలంగా ఉండును 
నీటిలో నానబెడితే ఉబ్బును 
సబ్జా గింజలండీ! సబ్జా గింజలు

కామెంట్‌లు