శ్రీమద్రామాయణము బాలకాండము: - ఎడ్ల లక్ష్మి సిద్దిపేట
దేవతలు శ్రీహరిని ప్రార్థించు సమయము నందు 
అగ్ని తేజస్సుతో యున్న కశ్య మహర్షి 
తన ధర్మపతయైనా అదితితో వచ్చినాడు
వెయ్యి సంవత్సరముల వ్రత పలమది

ఓ పురుషోత్తమ నీవు జ్ఞాన స్వరూపుడవు 
ముల్లోకాల గురించి అన్నీ తెలిసిన వాడవు 
జగత్ అంతా నీలోన చూస్తున్నాను నేను 
నేను నిన్ను వరము కోరా వచ్చితినయ్య 

దేవతలకు నీవిచ్చిన వరమే మాకు కూడా ఇవ్వాలి 
వామనావతారములో మా పుత్రునిగా జన్మించు 
బలి చక్రవర్తిని దానమడిగి 
అందరి బాధలను తొలగించు శ్రీహరి 

శ్రీహరి వామన అవతారము ఎత్తి 
బలిచక్రవర్తిని మూడు అడుగుల నేలను అడిగినట 
బలిచక్రవర్తి సరే నీ ఇష్టమున్నచోట తీసుకో శ్రీహరి 
ఆకాశంపై ఒక అడుగు నేలపై ఒక అడుగు 

అతని తలపై ఒక అడుగు శ్రీహరి పెట్టి
పాతాళానికి బలి చక్రవర్తిని తొక్కనట 
దేవతలంతా పూలవర్షము కురిపించిరచట
ముల్లోకాలకు ఇంద్రుని అధిపతిని చేసినాడు
శ్రీహరి గూర్చి శ్రీరామునికి విషయము తెలిపి సిద్ధాశ్రమమునకు చేరినారు


కామెంట్‌లు