సమాజానికి ప్రేరణ మహాకవి శ్రీ శ్రీ: - కవిమిత్ర, సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్- (పుష్యమి)-విశాఖపట్నం.
ఛందోబద్ధం కానక్కరలేదు కవిత్వం
ప్రజల హృదయ స్పందన కలిగించేదే అసలయిన కవిత్వమని
కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ కాదేది కవితకనర్హం అని
పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పై పైకని
ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది  గర్వకారణమని
ఎముకలు కుళ్ళిన  వయస్సు మళ్ళిన యువకుల్లారా  చావండని
యువతకు ప్రేరణనిచ్చిన  విప్లవకవి శ్రీ శ్రీ.


అగాథమగు జలనిధిలోన
ఆణిముత్యమున్నటులే
శోకాన మరుగున దాగి
సుఖమున్నటులే అని
జీవిత సారాన్ని సినీగీతాలలో వివరించిన
ప్రజాకవి శ్రీ శ్రీ.

తెలుగువీరలేవరా దీక్షాబూని సాగరా
దేశమాత స్వేచ్చకోరి తిరుగుబాటు చేయరా అని
అల్లూరి సీతారామరాజు సినిమాలో దేశభక్తి గీతం
నేటికి న భూతో న భవిష్యతి
మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన 
అదే భాగ్యమన్న శ్రీ శ్రీ బ్రతుకు సారాన్ని తెలియచేసిన ప్రజాకవి.

శ్రామిక అణగారిన వర్గాలకు యువతకు 
తన రచనల ద్వారా ప్రేరణనిచ్చి
ఈ శతాబ్దపు మహాకవిని నేనే అని నిర్భయంగా ప్రకటించుకున్న
విప్లవకవి శ్రీరంగం శ్రీనివాసరావు గారు
మీకివే నే నందిస్తున్న అక్షర కుసుమాలు... !!
..............................


కామెంట్‌లు