సామెత -207: ఆకుతోట సేద్యం అన్నవసరాలు తీరుస్తుంది
****
"ఏం జెయ్యాల్నో కాల్జేతులాడట్లేదవ్వా? గిప్పటికి ఏ పంటేసినా గిట్టుబాటు కాట్లే. నడ్మల నడ్మల గీ వానల్తో పంటంత ఆగమాగం అయింది. గీ త్యేప వొరి పంట మంచిగుందని సంబుర పడితే వానకి మొత్తం తడిశిపోయింది. గీ ఎగసాయం శెయ్యాలంటే ఇగ నా వొల్ల గాదు. గీ పొలం అమ్మి వచ్చిన సొమ్ముతో పిల్ల పెండ్లి జేసి పట్నానికి బత్కబోత" అంటున్న రంగయ్య మాటల్కి ఉల్కి పడింది అవ్వ.
"తమ్మీ! రంది జేయకు. ఒక్క పాలి అమ్ముకుంటే మల్ల మల్ల కొన్లేత్తమా శెప్ఫు.ఏదో ఉపాయం జెయ్యాలె గని.గిట్ల దైర్నం జెడితే ఎట్ల. "గింత బతుకు బతికి ఇంటెనక బడి సచ్చినట్టు" గస్మంటి మాటల్ని నోట్లెనించి రానీయయకు తమ్మీ!"
"ఎట్లవ్వా! ఎటు సూశినా శీకటే అగుపిత్తున్నది.గింత కాలం ఎట్లనో గట్ల బత్కినం గని ఇంగ బత్కే దారే అగపడట్లే. కోటీశు గాన్ని సుత ఏదన్న పనిల కుదిరిత్తా! గాన్ని సద్విచ్చే శత్తి లేదవ్వా! గీ కట్టాలు బరిచ్చే ఓపిక లేదు"
"ఏంది తమ్మీ! కట్టాలు మన్షికి గాక మానుకొత్తయా? జరంత సుతలాయిచ్చుకునే ఉపాయం జెప్త. ఆత్రపడి అడివిల బూవిని అమ్మకం బెట్టకు.గద్దలొతికె తన్నకపోయేటోళ్ళు శానా మంది ఉన్నరు.గా బూవికి నీళ్ళొసతి వుందా తమ్మీ?
"ఎందుకు లేదవ్వా? పోయినేడాది బోరేయిచ్చిన.బాగనే నీళ్ళు పడ్డయి. అన్ని ఉన్నయి అదృట్టమే లేదు."
"ఎందుకు లేదు తమ్మీ! గటువైపు నువ్వు సూడట్లేగని.
" గదేందవ్వా! గంతమాటనబడితివి. నా బతుకంత గా అడివిల బూవితోనే గడుత్తుంటే..."
ఇంట్లే కూరలు ఏం తింటరు తమ్మీ ! రైతు బజాట్ల తెచ్చుకోడమేనా?"
"లేదవ్వా! మీ మర్దలు ఇంట్లె కాళి తలంల కూరగాయలు ఆక్కూరలు ఏసింది గవి ఇంట్లె కూరగాయల లోటు తీరుత్తున్నయి."
"ఇంకేం తమ్మీ! గా శేసుడేదో అడివిల బూవిలో సుత జెయ్యరాదు. గిప్పుడు కూరగాయలకి ఎంతెంత గిరాకీ ఉందో తెల్సు గద!"
అంటే నన్ను ఆకుతోట సేద్దెం జెయ్యమంటవా ఏంది?"
గదేమన్న నామూషినా తమ్మీ! నీ గొడ్లు సుత ఉన్నయి వాటి పేడ ఎరువుతో మందులు ఎయ్యకుండ పండిత్తే నీ కట్టాలు తీర్తయి.మందుల్లేని కూరగాయలు ఆక్కూరలు అమ్మితే డబ్బుల్తో పాటు పున్నెం సుత వస్తది. గా జనాల్ని రోగాల్నించి తప్పించినోడివైతవు."
"అవ్వా! బలే జెప్పినవవ్వా! నిజ్జంగా నువ్వన్నట్టు నేను రైతుని నామూషీ ఎందుకు? బాయిల పుష్కలంగా నీళ్ళన్నయి. నువ్వు శెప్ఫినట్లె శేత్త. నువ్వు అందరికీ ఓ దైర్నం అవ్వా! గంద్కనే నా బాద శెప్పుకోడానికి నీ తానకి వొచ్చిన. గివీటితో నా సుడి దిరుగుద్దో సూడాలె."
"ఎందుకు తిరగదు తమ్మీ!అన్నం పంట పండిచ్చినోడు శెడిపోయిండేమో గని ఆగుదోట పండిచ్చినోడెవ్వడూ శెడలే.గందుకే మన ఎన్కటోళ్ళు "ఆకుతోట సేద్దెం అన్నవసరాలు తీరుత్తది"అన్నరు.
గదండీ సంగతి "ఆకుతోట సేద్యం అన్నవసరాలు తీరుస్తుంది"అంటే గదే మరి. గిప్పుడు గస్మంటి తలం లేనోళ్ళు మిద్దె తోటలు,శిన్న శిన్న కుండీల్లో కూరగాయలు,ఆక్కూరలు పండిచ్చుకుంటునేది తెల్సుకదా!.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి