233 వ రోజు
భగవద్గీత మొదటి అధ్యాయంలో భగవద్గీత ఏ సందర్భంలో ఎవరికి ఎందుకు చెప్పవలసి వచ్చింది అన్న విషయం వివరించారు. రెండవ అధ్యాయములో, తరువాత చెప్పబోవు విషయములు అన్నియు ఒక విషయసూచికలో మాదిరి వివరించారు. మూడవ అధ్యాయము నుండి కర్మయోగముతో మొదలెట్టి ఉపనిషత్తులతో ఉన్న విషయములు అన్ని వివరంగా చెప్పారు. మధ్యలో మనకు పూర్తిగా అర్థం అయ్యేవిధంగా విజువల్సు కూడా చూపించారు (విశ్వరూప సందర్శనం). తరువాత ఈ 'విద్య ఎంత' గుహ్యమైనదో వివరించారు. అర్జునుడు లేవనెత్తిన సందేహములు అన్ని ఓపికగా తీర్చారు. ఆఖరు అధ్యాయంలో అప్పటిదాకా చెప్పిన విషయములు అన్ని ఒక్కసారి సింహవ లోకనం చేసారు. ఆఖరున ఫలశ్రుతి గా శ్రీకృష్ణుడు, అర్జునుడు ఎక్కడ ఉంటారో అక్కడ సర్వసంపదలు, సకల ఐశ్వర్యైములు సుస్థిరమైన నీతి సమృద్ధిగా ఉంటాయి అని ముగించారు. కాబట్టి ఇలాంటి సందేహములు సరికావు.
ఇంకా కొంతమంది దేహధారులకు మరొక విచిత్రమైన సందేహం కలుగుతూ ఉంది. భగవద్గీత ఒక మతగ్రంధం అని అది హిందువులకు మాత్రం పరిమితం అయినది అని.
భగవద్గీత చెప్పబడిన కాలం ద్వాపర యుగం. అప్పుడు మతాలు లేవు. ఆ రోజుల్లో రాజ్యం కోసం, కొట్లాడుకున్నారేకాని, మతం కోసం కొట్లాడుకోలేదు. భగవద్గీతలో హిందూమతం అనే పదం ఎక్కడా మనకు వినపడదు. కాబట్టి ఇది ఒక సంకుచితమైన అభిప్రాయం. భగవద్గీత ఒక యూనివర్సల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. ఈ ప్రపంచంలో అందరూ అనుసరించ తగ్గది. ఈ లోకంలో ప్రతి మనిషి మాతృగర్భం నుండి భూగర్భం దాకా చేసే సుదీర్ఘమైన ప్రయాణంలో అనుదినము ఎలా ప్రవర్తించాలో.. వివరంచి చెప్పిన గ్రంధం భగవద్గీత. నేటి విద్యార్థులలో, యువకులలో, యువతులలో తలెత్తుతున్న నిరాశా వాదాన్ని పారద్రోలి, వారిని కార్యోన్ముఖులును చేసే చక్కని ఔషధము భగవద్గీత. ఈ గీతలో ప్రతి శ్లోకము ఆణిముత్యమే. ప్రతి పదమూ అనుసరణీయమే. భగవద్గీతలోని ఏ ఒక్క శ్లోకమును చదివి, అర్థం చేసుకొని, త్రికరణశుద్ధిగా ఆచరిస్తే వారి జీవితం శోభాయమానం అవుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.
(తిక్కన గారు భగవద్గీతను క్లుప్తంగా వివరించారు. అది ఇక్కడినుండి మొదలవుతుంది.)

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి