శ్రీకాకుళం గాంధీ మందిరంలో చంద్రశేఖర్ ఆజాద్ విగ్రహావిషణ

 గాంధీ మందిరంస్వాతంత్య్ర  సమరయోధుల సంఘ సంస్కర్తల తేజోమూర్తుల స్మృతి వనంలో పైడి అమ్మడు, తులసమ్మల జ్ఞాపకార్ధం ప్రముఖ అవధాన పండితులు విద్వాన్ పైడి హరనాధ రావు- లక్ష్మీ , పైడి రామచంద్రరావు - విశ్వేశ్వరి  మరియు కుటుంబ సభ్యులు నెలకొల్పిన స్వాతంత్ర్య సమరయోధులు చంద్రశేఖర్ ఆజాద్ విగ్రహాన్ని ఆదివారం ఉదయం వీరి కుటుంబ సభ్యులు కర్నల్ అల్లు మురళి, రోణంకి రవి నాగేశ్వరరావులు ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
జలియన్ వాలా బాగ్ సంఘటనలో అమాయకులైన భారతీయులను మూకుమ్మడిగా కాల్చి చంపడం, నిరసన తెలుపుతున్న లాలా లజపతి రాయ్ పై లాఠీ ఝులిపించి ఆయన మరణానికి కారణమైన ఈరెండు ఘోరమైన సంఘటనలు భారతీయ యువతను తీవ్రంగా కలచివేసాయని, వీటికి కారణమైన బ్రిటిష్ అధికారులు, పోలీసులను తుదముట్టించాలనే భావన, తదనంతర పరిణామాలు వీరిని విప్లవ పంథాలో సాగడానికి పునాదులు వేసాయని, ఈక్రమంలో జరిగిన పోరులో బ్రిటిష్ వారికి చిక్కుడం, వారి చేతిలో మరణించడం కంటే ఆత్మార్పణ మంచిదని భావించిన 24 ఏండ్ల చంద్రశేఖర్ ఆజాద్ తుపాకీ లోని చివరి తూటా తన తలకు గురిచేసుకొని వీర మరణం పొందాడని వక్తలు పేర్కొన్నారు. దేశభక్తి, స్వాతంత్ర్య కాంక్ష, త్యాగం, వీరోచిత పోరాటం వంటి అంశాలలో చంద్రశేఖర్ ఆజాద్ నేటి తరానికి స్పూర్తి ప్రదాతగా నిలుస్తారని పేర్కొన్న వక్తలు యువత ఆజాద్ లాంటి దేశభక్తులను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు.
అనంతరం వీరు గాంధీ మందిరం లో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి రఘుపతి రాఘవ గీతాన్ని సామూహికంగా ఆలపించారు. అనంతరం విగ్రహ దాత మరియు వారి  కుటుంబ సభ్యులకు గాంధీ మందిరం తరపున ఉచిత రీతిని సత్కరించారు.
ఈ కార్యక్రమంలో డా.నిక్కు అప్పన్న, బరాటం లక్ష్మణరావు, ఎమ్ వి ఎస్ ఎస్ శాస్త్రి, నిష్టల నరసింహ మూర్తి, చౌధరి రాధాకృష్ణ,నక్క శంకర రావు, జి నాగేశ్వరరావు,జగ్గమ్మ, గుత్తు చిన్నారావు, పి అప్పారావు, జయలక్ష్మి, రఘుపాత్రుని వెంకట రమణమూర్తి, మహిబుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు