శ్రీరాముడు అస్త్రములను స్వీకరించి సంతోషపరుడై
విశ్వామిత్రుడిని ప్రేమతో ఇలా అడుగుచుండెను
మీరిచ్చిన అస్త్రములను నేను పొందితిని
సురాసురులు సైతం నన్ను ఎదురు కొనలేరు
ఓ మహర్షి అస్త్రముల ఉపసంహరణ మంత్రము తెలుపుము
రాముని మాటలిని ముని ఎంతో సంతోషించి
ఉపసంహరణ మంత్రము నుపదేశించినాడు
ఓ రామ సత్యవంతుడ సత్య కీర్తిని పొందుమయ్య
శ్రీరాముడు వినయముతో ఆ మహర్షి నుండి
ఉపసంహరణ మంత్రములను స్వీకరించిగా
ఉపసంహరణ మంత్రములన్నియు
శ్రీరాముని ఎదలో చేరి నిలిచినాయి
మంత్రము స్వీకరించిన అనంతరము
ఆదిదేవతలు రాముని ఎదట నిలిచినారు
వారిదేహాలు దివ్య తేజస్సుతో వెలుగుచున్నాయి
దేవతలను చూసి రాముడు నమస్కరించినాడు
వారిలో కొందరు అగ్ని వలె
కొందరు పొగవలెను
మరికొందరు సూర్యచంద్రుల వలె వెలుగు చుండిరి
వారందరూ అంజలి ఘటించి
రాముని పై పూల వర్షము కురిపించినారు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి