భైతి దుర్గయ్య కు బాల సాహితీ మిత్ర పురస్కారం

  సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని రామునిపట్ల గ్రామానికి చెందిన రచయిత, ఉపాధ్యాయులు  భైతి దుర్గయ్య బాల సాహిత్య వికాసానికి చేస్తున్న కృషిని గుర్తించి హైదరాబాద్ కు చెందిన తెలంగాణ సారస్వత పరిషత్ "బాల సాహితీ మిత్ర "పురస్కారం ప్రకటించింది. మే నెల 4 వ తేదీన హైదరాబాద్ లో నిర్వహించనున్న బాల సాహిత్య సమ్మేళనం లో దుర్గయ్య కు పురస్కారం,5 వేల నగదు,జ్ఞాపిక అందచేస్తామని పరిషత్ కార్యదర్శి డా.చెన్నయ్య తెలిపారు.దుర్గయ్య ఇప్పటివరకు 250 మందికి పైగా విద్యార్థులను రచయితలుగా,కవులుగా తీర్చిదిద్దారు. విద్యార్థుల రచనలతో 7 పుస్తకాలు, ( జక్కాపూర్ బడి పిల్లల కథలు, మధుర పద్మాలు,జక్కాపూర్ జక్కనలు,అక్షర,అనంత సాగర అక్షర కెరటాలు,విశ్వతేజం, గూన ధార) స్వీయ రచనలతో 7 పుస్తకాలు ( అక్షర  సేద్యం , అలుకు మొలకలు , ఆరుగాలం పంట,దాప టెద్దు, రామసక్కని గాలి పటం, నక్షత్ర కోట,అరుగుబడి). మొత్తం 14 పుస్తకాలు వెలువరించారు.ఈ సందర్భంగా భైతి దుర్గయ్య ను జిల్లా కు చెందిన ఉపాధ్యాయులు,బాల సాహిత్య రచయితలు అభినందించారు.
కామెంట్‌లు