(లేఖ)
27/04/2026,
జనగామ.
గౌరవనీయులైన తల్లిదండ్రులకు,
నమస్కారం.
వేసవి సెలవులు ఆరంభమయినవి.మీ అందరి ఇంటి లోగిలి పిల్లా పెద్దలతో కళకళలాడుతున్నది కదా! చాలా సంతోషకరమయిన విషయం.వేసవి సెలవులనగానే పిల్లలందరికీ అమ్మమ్మ ఇల్లే గుర్తొస్తుంది . నానమ్మ, తాతయ్య ల ప్రేమానురాగాలే మెదులుతాయి.
. అమ్మమ్మ, తాతయ్య, మామ, అత్త, చూపే అపురూపమైన ప్రేమ, ఎప్పటికప్పుడు చేసే ప్రత్యేక వంటలు, హద్దు గీయని సద్దు చేసే ఆటలు, వీటన్నింటినీ ఆస్వాదించడానికి మీ,మీ పిల్లలందరూ సిద్ధమయ్యే ఉంటారు.ఇది ఆనందించదగిన విషయమే.కానీ, ఇక్కడే మీ అందరితో ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నాను.
అదేమిటంటే,ఒక పదిహేను,ఇరవై ఏళ్ల క్రితం వరకు వేసవి సెలవులంటే అమ్మమ్మ చెప్పే కమ్మని కథలు, తాతయ్య నేర్పే రామాయణ,భాగవతాలు,మామ గారితో ఆడే అష్టాచెమ్మా, బొమ్మరిల్లాటలు, అత్తగారు చెప్పే ఇరుగు పొరుగు ముచ్చట్లు వింటూ పిల్లలు ఒక ప్రత్యేక వ్యక్తిత్వానికి పునాది వేసుకునేవారు.
కానీ, రోజులు మారాయి.కథల స్థానంలో యూట్యూబ్ వీడియోలు,పద్యాల స్థానంలో ఇంగ్లీష్ పాటలు,ఆనందాల ఆటల స్థానంలో పబ్జీ లాంటి ఆటలు వచ్చి చేరాయి.వీటివల్ల ఇష్టాలు, నష్టాలు మాటేమిటో గానీ, మంచిని పెంచగలిగే సామర్థ్యం మాత్రం కొంచెం వెనక్కి పోతున్నదన్న విషయం అందరికీ తెలిసిందే .అయినా చాలా మంది ఈ దారిలోనే వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు.ఎక్కడో కొందరు తప్ప.అయినా, మరిచిపోయాను
మీతో ఇంకొక విషయం చెప్పాలి..మనందరికి కూడా మన పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోవడం ఇష్టమే .ఎందుకంటే ఇంగ్లీష్ నేర్చుకుంటేనే ఉద్యోగాలు వస్తాయి అనే బలమైన నమ్మకాన్ని సమాజం మనందరి మనసుల్లో బలంగా నాటింది.అందుకే పిల్లలు మన అమ్మ భాషను వదిలి పెట్టి, ఇంగ్లీష్ లో ఏది చెప్పినా కొండెక్కినంత సంతోషం మనకు.ఇందులో తప్పు అసలే లేదు.ఆంగ్లం నేర్చుకోవల్సిందే.పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాందించాలనే ఆకాంక్ష ఉండవలసినదే.కానీ, ఆంగ్లం వృత్తి నైపుణ్యానికి అవసరమైన, అందమైన, విలువైన విదేశీ భాష.ఈ భాషను పకడ్బందీగా నేర్చుకోమని ప్రోత్సహిద్దాం.నేర్చుకునేలా తోడ్పాటునందిద్దాం.ఇక్కడే మరో విషయం కూడా చెప్పాలి.
ప్రస్తుత సమాజంలో, గణితం, సైన్స్ బాగా వస్తే చాలు.వాటితో మా పిల్లలు ఇంజనీర్, డాక్టర్ అవుతారనే నమ్మకం పెరిగిపోయింది.ఇదీ తప్పు లేదు.ఏ తల్లిదండ్రికయినా తమ పిల్లలు బాగా చదువుకోవాలి.పెద్ద ఉద్యోగం సంపాదించాలనే ఉంటుంది .దాన్ని మనమెవరమూ తప్పు పట్టలేము.కానీ,ఆ రెండింటింతో పాటు, అమ్మ ఒడిలో నుండే ప్రేమగా నేర్చుకొన్న తెలుగు భాషను కూడా మరిచి పోవద్దు. కానీ,మనందరిలో చాలా మంది పిల్లల వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే "అమ్మ భాష"బాగా రావాలని ఎక్కువగా కోరుకోవడం లేదు.దీనికి మూల్యం ఇప్పటికే మనం చెల్లించుకుంటున్నాము.తల్లిదండ్రుల చెమట చుక్కలతో ఎదిగిన పైరులై, వారి శ్రమ శక్తినంతా విదేశాలకు, కేవలం వారి వారి స్వప్రయోజనాల కు ఎగుమతి చేసే యువతీ యువకుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది.తల్లి, తండ్రి, అక్కా, చెల్లి అనే బంధాల కంటే, ,బంగారం,బంగ్లాలు, సిరి సంపదలే ముఖ్యమనుకొని,బాధ్యతలు మరిచిపోతున్న తరాన్నీ చూస్తూనే ఉన్నాము.
ఇదీ తప్పు లేదు.ఎవరైనా ఉన్నత జీవితం కావాలనే కదా కోరుకునేది.కానీ,ఉన్నత జీవితమంటే కేవలం తామొక్కరే బాగుండాలని కోరుకోవడం కాదు.తమతో పాటు తమవారందరూ బాగుండాలని కోరుకోవడం.అందుకోసం అందరికీ అండగా నిలబడగలిగే వ్యక్తిగా ఎదగగలగడం.మరి ఇలా ఉన్నత వ్యక్తిగా ఎదగాలంటే, ఏది మంచి, ఏది చెడు అని తెలిపే విచక్షణ కలిగి ఉండడం.ఈ విచక్షణ ఎలా తెలుస్తుంది?
మన పూర్వ కవులు జీవితానుభవాలనన్నింటినీ రంగరించి రాసిన శతక పద్యాలు, నీతి, నిజాయితీ, ధర్మం,అధర్మం, ధైర్యం, స్నేహం,
పరోపకారం, సాహసం వంటి అనేక విలువలను చెప్పకనే చెప్పి మనసులో నాటుకునేల చేసే కమ్మని కథల ద్వారా వస్తుంది.
.వీటన్నింటినీ అడపా, దడపా తల్లిదండ్రులు, గురువులు, కుటుంబ సభ్యులు నేర్పించే వాతావరణంతో కూడిన సమాజం ఏర్పడితేనే , మనుషులు మరబొమ్మల్లా కాకుండా,మానవతా విలువల సిరులుగా ఎదిగేది.ఇప్పటికే మనం చూస్తున్నాం.కృత్రిమ మేధతో ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు సృష్టించగలిగే యాంత్రికత,మనుషుల్నీ యంత్రాలుగా మార్చేస్తున్నది.ఇంకా ఈ యాంత్రికంలో పూర్తిగా చిక్కుకు పోయి,మనసన్నదే లేని మనుషులుగా మన పిల్లలు మిగలకూడదంటే, పిల్లలందరికీ ఈ వేసవి సెలవుల్లో రోజుకొక గంట సమయమయినా వెచ్చించి,జీవిత విలువలను నేర్పే పద్యాలు, పాటలు, కమ్మని కథలు చెప్పే ప్రయత్నం చేయాలి.రోజు మొత్తంలో పిల్లలు ఎన్ని గంటలు ఎలాంటి ఆటలు ఆడినా,ఒక గంట సమయం మాత్రం భారత, రామాయణ గాథలు,ఇతర విశేషాలు తెలుగు లో నేర్చుకొనేలా ప్రోత్సహించాలి.ఇక్కడ మీ అందరితో మరొక విషయం చెప్పాలి.అలనాడు లంకను చూసిన లక్ష్మణుడు, రామునితో,అన్నా,లంకా నగరం ఎంత బాగుంది అని చెప్పే సందర్భంలో, రాముడు లక్ష్మణునితో,తమ్ముడూ, ప్రపంచంలో మనం పుట్టిన నేలకంటే ఏదీ గొప్పది కాదు.ఆ తలంపు కూడా మన మనసులోనికి రానీయకూడదు.మనం పుట్టిన నేల స్వర్గం కంటే గొప్పది అనే భావమే మనలో ఉండాలి అని,"జననీ జన్మ భూమిశ్చ,స్వర్గాదపీ గరీయసీ"అనే మాటను చెప్పాడట.అందుకే మనం కూడా,"మాతృ భాష, మాతృ దేవత,మాతృ దేశం"సర్వదా వందనీయాలు అనే సూక్తిని నమ్ముతూ, విజ్ఞానార్జన కోసం ఆంగ్లం నేర్పినా, ఉద్యోగం కోసం, జ్ఞాన సంపద కోసం, సమాజాభివృద్ధి కోసం గణిత, సామాన్య శాస్త్రాలను ఎంతో ఉన్నతంగా నేర్చుకోవాలని ప్రోత్సహించినా,జీవిత విలువలను నేర్పించే తెలుగు పద్యాలను, కథలను, ఇతిహాసాలను నేర్పించడం మాత్రం మరిచిపోవద్దు.అప్పుడే పిల్లలు ఎదిగి పెద్దవారయిన కొలదీ, జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లనయినా, మంచి,చెడుల విచక్షణ నయినా తెలుసుకోగలిగి ముందుకు సాగుతారు.లేదంటే, ఇప్పటికే అక్కడక్కడా జరిగే సంఘటనలు చూస్తూ ఉన్నాము, ఒత్తిడిని తట్టుకోలేక, సమస్యలకు తాళలేక,పదుగురిలో కలువలేక, ఒంటరితనాన్ని జయించలేక మధ్యలో తనువు చాలించేవారిని,లేదంటే దురలవాట్లకు బానిసలుగా మారి అటు తల్లిదండ్రులకు, ఇటు సమాజానికి చీడ పురుగులు గా మారుతున్నవారిని.అలాంటి సంఘటనలు ఎవరూ ఎదుర్కోకుండా ఉండాలన్నా,మానవతావాదం కలకాలం నిలబడాలన్నా, చిన్న నాటి నుండే పిల్లలకు క్రమశిక్షణ పెంచే ఆధ్యాత్మిక చింతన,పుస్తక పఠనం,ఆలోచింప చేసే ఆటలు,అనుబంధ బాంధవ్యాలకు సంబంధించిన విశేషాలు, సహాయ,సహకార,సాహస గాథలు వంటి విషయాలను నేర్పించాలి.ఈ ఒక్క వేసవి సెలవులనే కాదు.పిల్లలు పెరిగి, పెద్ద వారయి,తమ జీవితాన్ని తాము స్వాధీనంగా నడుపుకునేంత వరకు వీటి ప్రాధాన్యత, ప్రభావం వారిపై ఉండేలా చూడగలగాలి.
ఇప్పటికే మీ అందరితో చాలా విషయాలు పంచుకొన్నాను.ఏంటి ఇదంతా అని మాత్రం ఎవరూ అనుకోకూడద నే ఆశిస్తూ,ఆశల,ఆశయాల సాధనలో ఈ తరం చిన్నారులంతా, రేపటి పౌరులుగా ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షిస్తూ,
===================================================================

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి