తెలియని పరుగెందుకో
నడిపే దైవం ఎవరో!
తీరం చేరేదెపుడో..
తెలిపే నేస్తం ఎవరో!
కమ్మిన చీకటి కరిగి
వెలుతురు వచ్చేదెపుడో..!
నమ్మిన మంచి రోజులు
కమ్మగ చూసేదెపుడో!
అడుగులు సాగే నడకకు
అలసట తీరేదెపుడో!
అలవి కాని దూరం
చేరువయ్యేదెపుడో!
అందుకోలేని విజయం
అందేదెపుడో...!
అదుపు లేని ఆశలు
తీరేదెపుడో..!
అలసిన ప్రతిసారీ
అలలే గురువులుగా
ఆపక నెరపే యత్నమే
అందించే తీరు జయమే!
రేపన్నది రాకపోదు
నీదన్నది దొరకకపోదు
ఆశే జీవన సూత్రమని
అడుగు ముందుకే వేయమనే
సహనానికి
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి