విశ్వామిత్రుని యాగమును సంరక్షించుట : - ఎడ్ల లక్ష్మి సిద్దిపేట
ఓ బ్రహ్మర్షి ఆ రాక్షసులు ఎటు నుండి వస్తారు 
యజ్ఞం విఘ్నం చేయుటకు ఎప్పుడు వస్తారు 
వారిని నివారించుటకై సిద్ధంగా ఉంటాము 
రాముని మాటలిని సంతోషించినారాముణులు

విశ్వామిత్రుడు మౌన దీక్షలో ఉండగా 
మునివారులు రాముని ఈ విధముగా కోరినారు 
రామా ఆరు దినములు యజ్ఞంను రక్షించు 
నీకు అంతా మేలు జరుగుతుంది  

రామలక్ష్మణులు అచట నిష్టతో నిలచినారు 
యజ్ఞోజాలలో దట్టంగా పైకి ఎగేసినాయి 
విశ్వామిత్రుడు రుద్వీజులు  ఆశీనులైనారు 
యజ్ఞంలో సమిధలు పుష్పాలను వేసినారు 

యజ్ఞము వేదమంత్రాలతో జరుపుచున్నారు 
భయంకరమైన రాక్షసుడు అచటికి చేరి
కొండపోతగా రక్తవర్షము కురిపిస్తుండగా 
రాముడు బాణాలేసి దానిని ఆపినాడు 

శ్రీరాముడు మానవ అస్త్రమును
మారీచునిపై ఎక్కు పెట్టి వేసినాడు  
ఆగ్నేయస్త్రము శుభాహు వక్షస్థలమున కొట్టినాడు 
బాణము ధాటికి వాడు నేలకొరిగినాడు
యజ్ఞము నిర్విఘ్నముగా సమాప్తమయ్యెను


కామెంట్‌లు