కష్టజీవుల పక్షాన నిలిచిన ప్రజా కవి శ్రీశ్రీ అని, చెమట చుక్కల విలువనెరింగిన మహా సామాజికవేత్త శ్రీశ్రీ అని కొత్తూరు రచయితల వేదిక అధ్యక్షులు కలమట శ్రీరాములు అన్నారు. స్థానిక విజ్ఞాన భారతి ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన కొత్తూరు రచయితల వేదిక పదమూడవ నెల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను సైతం ప్రపంచానికి సమిధ నంటూ సంఘం పట్ల ప్రజల్లో దేశభక్తినేర్పరచిన మహనీయుడు శ్రీశ్రీ అని అన్నారు. నేడు శ్రీ శ్రీ జయంతిని పురస్కరించుకుని వేదిక ప్రధాన కార్యదర్శి అమ్మల కామేశ్వరి శ్రమజీవుల స్పూర్తి శ్రీ శ్రీ అనే స్వీయ గీతాన్ని ఆలపించి, జ్యోతి ప్రజ్వలన గావించి నేటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యదర్శి నివేదికను వినిపించీ కొత్తూరు రచయితల వేదిక కృషిని కామేశ్వరి వివరించారు. గత పన్నెండు నెలల కార్యక్రమాల స్పూర్తిని కార్యదర్శి నివేదికగా కామేశ్వరి సభకు వినిపించారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన జి.నరేష్ రామ్ జీ మాట్లాడుతూ శ్రీ శ్రీ అరసం విరసం వంటి సామాజిక స్పృహతో కూడిన సంఘాలు స్థాపించి, అభ్యుదయ భావజాలంతో తన జీవితాన్ని అంకితమొనర్చారని అన్నారు. మన సాహిత్య లోకానికి ఆదర్శనీయుడు శ్రీ శ్రీ అని రామ్ జీ అన్నారు.
వేదిక సభ్యులు, తెలుగు భాషా పండితులు, సీనియర్ రచయిత అల్లిన వెంకట రమణ మూర్తి దిలీప్ రాజా పట్నాయక్ సమన్వయంతో శ్రీశ్రీ కి సంబంధించిన కవితలతో గీతాలతో కవిసమ్మేళనం జరిగింది. ఈ కవి సమ్మేళనంలో వేదిక అధ్యక్షులు కలమట శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి అమ్మల కామేశ్వరి, సహ కార్యదర్శి గడసాపు ఉషారాణి, అల్లిన వెంకట రమణ మూర్తి దిలీప్ రాజా పట్నాయక్, సల్ల మన్మధరావు, గజివిల్లి మోహనరావు, పెరిశెట్టి రామచంద్రరావు, గుత్తావిల్లి శ్రీనివాసరావు, చింతాడ మార్కో, ముదిల శంకరరావు తదితరులు స్వీయ కవితా గానం చేసి సభాసదుల ప్రశంసలు పొందారు. శ్రీ శ్రీ జీవిత చరిత్ర గురించి చక్కగా ఉపన్యసించిన స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిణి ఎ.అస్మితతో పాటు, చిన్నారులు ఎస్.మధుమిత, కె.శ్రావ్యలకు ప్రత్యేక బహుమతులను ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత సల్ల మన్మధరావు చేతులమీదుగా బహూకరించారు. అనంతరం ముఖ్య అతిథి, యువకవి, గాయకులు, సామాజిక సేవకులు, ఉపాధ్యాయులు జి.నరేష్ రామ్ జీ ని, వేదిక సభ్యులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యావంతులు సాహిత్యాభిమానులు బోర ప్రశాంతి, బి.మాధురి, కె.బుజ్జి, జి.నాగమణి, జి.చిరంజీవి, కె.త్రినాథ్, జి.కోమల తదితరులు పాల్గొన్నారు. అనంతరం మిఠాయి పంపకం జరిగింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి