పిబరేరామరసం.:- డా సి.వసుంధరఎం- చెన్నై ._09790878439
సూర్యవంశచంద్రుని నీమది మందిరమందు
నిల్పి ఇందిరా సమేతునిసదాస్మరించు సుందరుడా! 

రామ కథాశ్రవణానంద
పరవశుడా, 
మర్కటకులతల మాణిక్యమకుటమా! హనుమా!
కనుమా,నిన్నే సుమా!మాసంతోష పుష్ప మంజరులివిగో.

అంజనీపుత్ర ,
నీవు ఉదయించిన 
ఈ ఉషోదయ  మెంత
సుదినమోగదా!

శిశువై ఆకటి వేళ
అంబర స్థలి 
అరుణోదయ బింబముపమింప 
నీ ఒక్కఊపున
బోయి భుజింప చూచుట నీ పరాక్రమమేమని చెప్పుదున్.

రవి, నీ గురువు సకల శాస్త్ర కోవిదుడ వీవు.
 రామ కార్య నిర్వాహణ దక్షత,
సాక్షిగా నిలిచే
నీ కార్యపటిమకు,
రామ భక్తికిన్.
 
ఈదితివి సాగరము,సాద్వి సీతమ్మసందర్శన భాగ్యమబ్బగా,
ఉబ్బే నీమనసు మబ్బులు తొలగి 
లంకనుండి
అకళంకగాఅమ్మ,సీతమ్మ. రామయ్యతో కలిసి  కాలూనే 
నయోద్యలోన్.
 
రాముడున్నచోటే నీకు భక్తిసామ్రాజ్యము.
రత్నాలు విరిచి విసిరితివి నీ స్వామి
 కొలువు అందు కొరవైనదని నీవు.
రామా అంటే పిచ్చి ప్రేమయ్య నీకు.
సీతారాముల సేవ
 నిన్ను తరింప చేసిన నావ.
హనుమాన్చాలిసా అనుదినము నాలుకపై నాట్యమాడగ 
వలయు నరులకు వానరోత్తమా!నీకు
సహస్రవందనాలు.

🌲హనుమ🐒 జయంతి 🌱🍀🌿🌱🌿💦
సందర్భంగా కవిత.
 🐒🐵🙏🏼🙏🏼

కామెంట్‌లు