డాక్టర్ కె.జానకిగారి పుస్తకం*రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఫ్రీడం స్ట్రగుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్*
నేడు రాయలసీమ ప్రాంతాలకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులైన మగువల గూర్చి తెలుసుకుందాం! నెల్లూర్ కిచెందిన నల్లపరెడ్డి (తంబళ్లపల్లి) అనసూయాదేవి1924 లో పుట్టారు.తండ్రి తిక్కవరపు రామిరెడ్డి, భర్త రఘునాధరెడ్డి ప్రోత్సాహంతో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మద్రాస్ లో ప్రభుత్వ ఆఫీసులముందు పికెటింగ్ చేసింది విద్యార్థులతో కలిసి.1943లో ఆమె మద్రాస్ లో క్వీన్ మేరీస్ కాలేజీలో విద్యార్థిని.ఎగ్మూర్ మేజిస్ట్రేట్ కోర్ట్ ముందుకూడా పికెటింగ్ చేయటంతో వెల్లూరుజైలుశిక్ష అనుభవించారామె.ఆమె పి.సి.సి.,ఎ.ఐ.సి.సి. మెంబర్.1960నుంచి శ్రీవేంకటేశ్వర యూనివర్శిటీ సిండికేట్ మెంబర్ గా 13 ఏళ్లు న్నారు.స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ ,రెడ్ క్రాస్ సభ్యురాలు.1967_1972దాకా ఆంధ్ర ప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కి ఎన్నుకోబడిన అనసూయాదేవి"శ్యామపర్ణి" అనే కవితాపుస్తకంని ప్రచురించారు. 1974_1977దాకా ఆంధ్ర ప్రదేశ్ అఫిషియల్ లాంగ్వేజ్ కమిషన్ మెంబర్ గా,7జులై 1977లో దానికి ఛైర్మన్ గా ఉన్న అనసూయాదేవిభర్త కూడా ఫ్రీడం ఫైటర్!బళ్లారికి చెందిన ఆర్.వెంకమ్మ వెల్లూరుజైలుశిక్ష అనుభవించిన మహిళ. తంబళ్లపల్లికి చెందిన శకుంతల 1927లో పుట్టారు.అనసూయాదేవి చెల్లెలు.భర్త కృష్ణారెడ్డి. అక్కతో పాటు మద్రాస్ లో విద్యార్థుల ఉద్యమాల్లో పాల్గొని 20.2.1943లో 6నెలల జైలుశిక్ష అనుభవించిన మగువ. బళ్లారికి చెందిన ఆర్.వెంకమ్మ 28.1.1943లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించింది.ఇకరాయచోటికి చెందిన హర్దగిరి నర్సమ్మ భర్త హెచ్.ఎన్.సింహం ప్రోత్సాహంతో క్విట్ ఇండియాఉద్యమంలో గుంతకల్ లో అరెస్టయింది. కానీ ఆమె జాడ తెలీదు ఆతర్వాత! ఆమె భర్త కి లాఠీచార్జ్ వల్ల మోకాలువిరిగింది!
కోటకర్నూల్ కి చెందిన సిర్దర్ అమరావతమ్మ తండ్రి ఎనుముల అంకన్న,భర్త నాగప్ప ఎం.ఎల్.ఎ.గా చేశారు.26అక్టోబర్ 1942 లో వెల్లూరుజైలుశిక్ష అనుభవించిందామె.ధోన్ కి చెందిన పేరం బోయమ్మ తల్లి భాగ్యమ్మ. 9నెలల వెల్లూరుజైలుశిక్ష అనుభవించింది బోయమ్మ. ఆదోనికి చెందిన బల్లెకల్లు రామక్క తన 70వ ఏట పోలీసుస్టేషన్ వద్ద జరిగిన పికెటింగ్ లో పాల్గొన్నందుకు ఆమెపై లాఠీఛార్జి జరిగింది.🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి