వ్యక్తిగత సత్యాగ్రహంలో పాల్గొన్న కొందరు మహిళల గూర్చిన వివరాలు తెలుసుకుందాం! శృంగారకవి లక్ష్మీనరసమ్మ, మల్పురి చుక్కమ్మ,కొటికలపూడి సరస్వతీదేవి,రుక్మిణీలక్ష్మీపతి ఇలా ఎందరో 1940_41 స్వాతంత్య్ర సమరంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించారు.16 డిసెంబర్1946లో 500రూ.ఫైన్ వెల్లూరుజైలుశిక్ష అనుభవించిన ఆమె చుండూరి రత్నమ్మ. ఖాదీ ప్రచారంతోపాటు హరిజనోద్ధరణకు నడుంకట్టిందామె.హిందీ ప్రచారంచేసింది.1940లో ఏలూరుమున్సిపల్ కౌన్సిల్ ఛైర్మన్ గా ఎన్నికైన తొలి మహిళ!కోటమర్తి కనకమహాలక్ష్మిఎన్నోసార్లు లాఠీదెబ్బలు తిన్న వీరనారి. 55రూ.ఫైన్ వెల్లూర్ కడలూర్ లో జైలుశిక్ష అనుభవించింది15జనవరి 1941లో! గోకరాజు వెంకాయమ్మ జువ్వలపాలెం కి చెందిన మనియ వెంకట రాజు గారి కుమార్తె.ఆమె భర్త సూర్య నారాయణ రాజు.15రూ.ఫైన్ తోపాటు15జనవరి 1941లో వెల్లూరు కడలూర్ లోజైలుశిక్ష అనుభవించిన మహిళ.ఇల్లూరు కాశమ్మ, కస్తూర్బా మెమోరియల్ ట్రస్ట్ ఫండ్ మెంబర్.అనంతపురం ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ సెక్రటరీగా సేవ చేశారు.అనంత పురంకి చెందిన ప్రతాపగిరిశాంతాబాయి1905లో జన్మించారు.తండ్రి సుబ్రమణ్యం,భర్త రామ్మూర్తి.20జనవరి1941లోవెల్లూర్ జైల్లో ఉందామె.కల్యాణ దుర్గ తాలూకాకి చెందిన సేతూర్ నివాసి కరణం ఉమాబాయమ్మ. సూరప్ప ఆమె తండ్రి.25జనవరి 1941లో వెల్లూర్ కడలూర్ లో జైలుశిక్ష అనుభవించింది.పుత్తూరు లోని నగరికి చెందిన జానకమ్మ తండ్రి కె.వరదాచారి.17జనవరి1941లో వెల్లూరుజైలుశిక్ష అనుభవించిన మహిళ.తిరుమల కి చెందిన హెచ్.నర్సమ్మ 21ఫిబ్రవరి 1941 లో యుద్ధానికి వ్యతిరేకంగా చంద్ర గిరిలో నినాదాలు చేసినందుకు 4*అణాలఫైన్* వేస్తే మెజిస్ట్రేట్ తనే 4అణాలు చెల్లించి జైలుశిక్ష పడకుండా చేశాడు.హెచ్.ఎన్.సింహం గారిభార్య హర్దగిరి నర్సమ్మ రాయచోటివాసి. 1940లో ఫైన్ వేసి వదిలేశారు.వీణ శేషమ్మ ఇప్పిరాలలో 10సెప్టెంబర్1876లోపుట్టారు.భర్త గోవిందరాజులు అధ్యాపకుడు.ఈమె ఖాదీ ప్రచారంచేసింది.23డిసెంబర్1954లో ఆమె చనిపోయారు.సిర్దార్ అమరావతమ్మ కోటకర్నూల్ వాసి.తండ్రి ఎనుముల అంకన్న,భర్త సిర్దర్ నాగప్ప కర్నూల్ కి చెందిన ఫ్రీడంఫైటర్.ఆమె 25జనవరి 1941 లో వెల్లూరుజైలుశిక్ష అనుభవించింది.నంద్యాల కిచెందిన లక్ష్మీదేవమ్మ,
ఎలుకూరు సుబ్బరత్నమ్మ వెల్లూరుజైలుశిక్ష అనుభవించిన మగువలు.బోగోలు కి చెందిన చెగిరెడ్డి లీలాదేవి తండ్రి కేతిరెడ్డి పెద్ద రెడ్డి.భర్త బాలిరెడ్డి.ఈమె ఆంధ్ర రాష్ట్ర రైతుసంఘం జాయింట్ సెక్రటరీగా, కర్నూల్ జిల్లా కాంగ్రెస్ మెంబర్ గా పనిచేశారు🌷
ఎలుకూరు సుబ్బరత్నమ్మ వెల్లూరుజైలుశిక్ష అనుభవించిన మగువలు.బోగోలు కి చెందిన చెగిరెడ్డి లీలాదేవి తండ్రి కేతిరెడ్డి పెద్ద రెడ్డి.భర్త బాలిరెడ్డి.ఈమె ఆంధ్ర రాష్ట్ర రైతుసంఘం జాయింట్ సెక్రటరీగా, కర్నూల్ జిల్లా కాంగ్రెస్ మెంబర్ గా పనిచేశారు🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి