మరుగున పడిన మగువలు19 వభాగం...అనువాదం..అచ్యుతునిరాజ్యశ్రీ
 డాక్టర్.కె.జానకిగారిRole of women in freedom struggle in Andhra Pradesh 
1923లో మగువలు చేసిన ఆందోళన చెప్పుకోదగ్గది.అది జనరల్ నెల్ విగ్రహాన్ని తొలగించాలని మద్రాస్ ప్రభుత్వాన్ని అగ్గగ్గలాడించినతెలుగు వనితల తెగువ !1857లో తిరుగుబాటులో అతనిపాశవికక్రూరచర్యలకి బలైనభారతీయులకు లెక్కలేదు.దీనికి నాయకత్వంవహించినవారు బ్రహ్మజోస్యుల లక్ష్మీనరసమ్మ, దువ్వూరు సుబ్బమ్మగార్లు.సీతానగరం ఆశ్రమానికి చెందిన  ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్.సుబ్రమణ్యంగారితల్లి లక్ష్మీనరసమ్మ గారు.ఆమె మద్రాస్ లో ఆంగ్ల ప్రభుత్వాన్ని నిగ్గదీసింది"జనరల్ నెల్ విగ్రహాన్ని ఇక్కడ తీసేయాల్సిందే! లేకుంటే నేను కదలను" అని మీటింగ్ లో ఛాలెంజ్ చేసి మొండికేసిన వీరనారీమణి. ఆమె 75వ ఏట ఇలా అక్కడ నినాదం ఇచ్చారు," నామాతృభూమికోసం నేనేమైనా ఫర్వాలేదు.ముందు ఆకిరాతకుడి విగ్రహాన్ని ఇక్కడ నుంచి తొలగించకపోతే ఊరుకునేదేలేదు. దైవంకి మొక్కుతూ చేస్తున్నా ప్రతిన" 
ఇక దువ్వూరి సుబ్బమ్మగారు స్వాతంత్య్రోద్యమంలో  గర్జించిన సివంగి,సంఘసేవిక.1880లో ద్రాక్షారామంలో పుట్టారామె.తండ్రిమల్లాది సుబ్బావధాని.  బీద బ్రాహ్మణుడైన దువ్వూరి వెంకయ్యతో పెళ్లి,బాలవితంతువు కావటంఆమె జీవితం1920_1947 దాకా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన ఆమెస్ఫూర్తిదాత.శ్రీ తిరుపతి వెంకట శాస్త్రిగారివద్ద పురాణాలు రామాయణ భారతభాగవతాలు క్షుణ్ణంగా చదివారుఆమె.బులుసు సాంబమూర్తిగారు ఆమెకు రాజకీయ గురువు.సర్కారుజిల్లాల్లో పర్యటించి వందలాది ఉపన్యాసాలతో జనాల్లో జోష్ నింపిన సుబ్బమ్మగారు జైలుశిక్ష అనుభవించిన తొలితెలుగుమగువ.ఆమె జైలునించి విడుదలైనాక జనం బ్రహ్మరథం పట్టారు.8వేలమంది ఆసభకు హాజరైనారు.జైలుబైట ఆమెకోసం నిలబడి రుద్రాక్ష మాలతో ఆమెకు స్వాగతం పలికారు.దేశబాంధవి అనేబిరుదుతో సత్కరించారు.14ఏళ్లు ఎ.ఐ.సి.సి.మెంబర్ గా  ఉన్న ఏకైక వనిత. ఖాదీప్రచారంతో పాటు"సనాతనస్త్రీవిద్యాలయ" ని రాజమండ్రిలోనెలకొల్పి వితంతువుకు దారిచూపారు.  తన పూజాపునస్కారాలలో మునిగితేలుతూకూడా హరిజనోద్ధరణ,అంటరానితనంనిర్మూలనకై ఆరోజుల్లో పోరాడిన ఆమె స్వాతంత్య్రంవచ్చాక రాజకీయాలకు గుడ్ బై కొట్టారు.నిర్భయత్వం,ఠకామనిగూబగుయ్ అనిపించే మాటలకి జనం మద్దతు ఇచ్చారు.పోలీసులు ఆమె ఎడ భక్తిగౌరవ మర్యాదతోమెలిగేవారు. 31మే 1964లో రాజమండ్రిలో ఆమె పరమపదించారు.🌷

కామెంట్‌లు